Zombie Deer Disease : అమెరికాలో ‘జాంబీ డీర్‌ వ్యాధి’ కలకలం..ఖంగారుపడుతున్న అగ్రరాజ్యం

  • Written By:
  • Publish Date - December 27, 2023 / 12:16 PM IST

అగ్రరాజ్యంలో ‘జాంబీ డీర్‌ వ్యాధి’ (Zombie Deer Disease) కలకలం రేపుతోంది. ప్రకృతి వైపరీత్యం మరోటో కానీ ప్రపంచంలో రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి, కొత్త వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్ల కారణంగా రోజురోజుకూ కొత్త రోగాలు విస్తరిస్తున్నాయి. కొన్ని వ్యాధులకు ఇప్పటి వరకు మందు కనిపెట్టడంలో శాస్త్రవేత్తలు వెనుకబడే ఉన్నారు. కొన్ని వ్యాధులు త్వరగా నయమవుతాయి కొన్నింటికి సమయం పడుతుంది. కొన్ని జబ్బులు శరీరంలోకి ప్రవేశించి మృత్యువు వైపు నెట్టివేస్తున్నాయన్న విషయం కూడా తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చాలా రోగాల లక్షణాలు తెలుస్తాయి కాబట్టి వాటికి సరైన చికిత్స అందించవచ్చు, కానీ కొన్ని వ్యాధుల లక్షణాలు తెలియవు అవి తెలిసే సమయానికి చాలా ఆలస్యం అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా అగ్రరాజ్యంలో వింత వ్యాధి (Zombie Deer Disease) కలకలం రేపుతోంది. అ‍క్కడ ఏటా వందలాది జంతువులు ఈ వ్యాధి బారినపడటంతో ఎక్కడ మానవులకు సంక్రమిస్తుందో అని భయాందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఏంటా వ్యాధి ? అంటే జాంబీ డీర్‌ వ్యాధి. సెర్విడ్స్, జింక, ఎల్క్, కారిబౌ, రెయిన్ డీర్, దుప్పి వంటి జంతువులు ‘జోంబీ డీర్ డిసీజ్’ లేదా క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ (CWD) అనే ప్రాణాంతక వ్యాధికి గురవుతున్నాయి. వందలాది జంతువులు ఈ వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఎల్లోస్టోన్‌ నేషనల్‌ పార్క్‌లోని జంతువుల్లో (Deer) తొలిసారిగా ఈ వ్యాధిని కనుగొన్నారు. ఆ తర్వాత నుంచి వందల కొద్ది జంతువులు ఈ వ్యాధి బారినే పడటం శాస్త్రవేత్తలను ఒకింత భయాందోళనలకు గురి చేసింది. ఈ వ్యాధి ప్రముఖంగా ఉత్తర అమెరికా, కెనడా, నార్వే, దక్షిణ కొరియా వంటి ప్రాంతాల్లోని జింక, లేళ్లు, దుప్పి వంటి జంతువుల్లో ప్రబలంగా ఉన్నట్లు తెలిపారు. దీని కారణంగా బద్ధకం, ఉన్నటుండి తూలిపోవడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం వంటి నాడీ సంబంధిత లక్షణాలు బహిర్గతమవుతాయి.

ప్రధానంగా జంతువులకే సంక్రమించినప్పటికీ అది చివరికి మానవులకు కూడా సంక్రమించే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు మానవులకు సోకిన దాఖలాలు లేకపోయినా భవిష్యత్తులో మానవులకు సంక్రమించదన్న గ్యారంటీ లేదని ఎపిడెమియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు బ్రిటన్‌లో వచ్చిన ‘మ్యాడ్‌ కౌ వ్యాధి(పిచ్చి ఆవు వ్యాధి)’ గుర్తు చేసుకున్నారు. వందలకొద్ది ఆవులను వధించడంతో వచ్చిన పిచ్చి ఆవు వ్యాధి ఎలా మానువులకు సంక్రమించిందో ఉదహరిస్తూ వార్నింగ్‌ ఇస్తున్నారు నిపుణులు.

Read Also : Bharat Nyay Yatra : జనవరి 14 నుంచి రాహుల్‌గాంధీ ‘భారత్ న్యాయ్ యాత్ర’