Site icon HashtagU Telugu

Waiter Jobs : కెనడాలో వెయిటర్ జాబ్స్.. వేలాది మంది భారత విద్యార్థుల క్యూ

Waiter Jobs Indian Students Canada

Waiter Jobs : శాలరీ భారీగా ఉంటే చాలా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అలాంటి మెగా జాబ్ ఆఫర్‌ను వదిలేందుకు ఎవరూ ఇష్టపడరు. మనదేశంలో చేయలేని జాబ్‌ను కూడా.. శాలరీ భారీగా ఉందనే కారణంతో ఫారిన్‌లో చాలామంది చేసేస్తుంటారు. ఆయా పార్ట్ టైం పనుల ద్వారా వచ్చే డబ్బుతో తాత్కాలికంగా నిలదొక్కుకుంటారు.  ఇందులో తప్పేం లేదు. వాస్తవానికి జాబ్ చిన్నదైనా, పెద్దదైనా దేని వ్యాల్యూ దానికి ఉంటుంది. లోపం జాబ్‌లలో లేదు.. ఆలోచనలోనే ఉంది. తాజా అప్‌డేట్ ఏమిటంటే.. కెనడాలోని ఓ రెస్టారెంట్ వెయిటర్ పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు మన ఇండియన్స్(Waiter Jobs) పెద్దసంఖ్యలో క్యూ కట్టారు.

Also Read :Yahya Sinwar : యహ్యా సిన్వార్.. పేపర్, పెన్.. ఖతర్ సర్కారు కీలక ప్రకటన

కెనడాలోని బ్రాంప్టన్‌ నగరంలో కొత్తగా ఒక రెస్టారెంట్ ఏర్పాటైంది. దాని పేరు తందూరి ఫ్లేమ్. తమ వద్ద పనిచేసేందుకు వెయిటర్లు, సర్వర్లు కావాలని పేర్కొంటూ ఈ రెస్టారెంట్ ఒక అడ్వర్టయిజ్మెంట్ ఇచ్చింది. దీన్ని చూసిన ఎంతోమంది ఇండియన్స్  తమ రెజ్యూమేలు చేతపట్టుకొని క్యూ కట్టారు. దాదాపు 3వేల మందికిపైగా భారత విద్యార్థులు వచ్చి వెయిటర్, సర్వర్ పోస్టుల కోసం అప్లికేషన్లు సమర్పించి, ఇంటర్వ్యూలు ఇవ్వడం గమనార్హం. పెద్దసంఖ్యలో భారత విద్యార్థులు రెస్టారెంట్ వద్ద క్యూ లైనులో నిలబడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  కెనడా లాంటి విదేశాలకు వెళ్లే భారత విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ కోసం ఎంతగా ప్రయారిటీ ఇస్తారో దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు.  అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాల్లో నిత్యావసర ఖర్చులు చాలా ఎక్కువ. ఆ ఖర్చులను వెళ్లదీసుకునేందుకు ఈవిధంగా భారత విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేయాల్సి వస్తుంటుంది. కొందరు భారత విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటూ డ్రైవింగ్‌ను పార్ట్ టైం వర్క్‌గా  చేస్తుంటారు. మొత్తం మీద పార్ట్ టైం జాబ్స్ కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, డ్రైవింగ్ అనేవి హాట్ ఆప్షన్స్‌గా ఉన్నాయి.

Exit mobile version