Site icon HashtagU Telugu

FIFA World Cup 2022: అర్జెంటీనాపై సౌదీ విజయం…ఆటగాళ్లకు కానుకల వర్షం కురిపించిన సౌదీ ప్రభుత్వం..!!

Fifa World

Fifa World

ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనాపై పసికూన సౌదీఅరేబియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అర్జెంటీనాపై అద్భుత విజయం తర్వాత సౌదీ ఆటగాలపై కానుకల వర్షం కురిపిస్తోంది ఆ దేశ ప్రభుత్వం. సౌదీ యువరాజుమహ్మద్ బిన్ సల్మాన్ ఆటగాళ్లందరికీ ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును బహుమతిగా ఇవ్వనుంది సౌదీ ప్రభుత్వం. ఈ కారు విలువ ధర 500000యూరోలు ( దాదాపు రూ. 4.25కోట్లు) సౌదీ అరేబియా విజయం తర్వాత జట్టు అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ గ్రాండ్ విక్టరికీ సంబంధించి దేశమంతా పండగ వాతావరణం నెలకొది. సౌదీ రాజు సల్మాన్ గత బుధవారం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. సౌదీపై అర్జెంటీనా జట్టు ఓటమి తర్వాత దాన్ని స్థానాన్ని కోల్పోయింది. లియోనెల్ మెస్సీ నేత్రుత్వంలోని ఈ జట్టు గత 36 మ్యాచులలో విజేతగా ఉంది.

కాగా సౌదీ, అర్జెంటీనా, మెక్సీకో , పోలాండ్ లతో పాటు గ్రూప్ సిలో ఉంది. ఇప్పుడు రానున్న మ్యాచులో పోలాండ్, మెక్సికోతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో పోలాండ్ ను ఓడిస్తే…ప్రీకార్వర్ట్ ఫైనల్ కు చేరే అవకాశం ఉంటుంది.