Site icon HashtagU Telugu

Saudi Prince: పాకిస్థాన్ ను ఆదుకునేందుకు సౌదీ ప్రిన్స్ కీలక నిర్ణయం.. అదేంటంటే?

Saudi Prince

Saudi Prince

Saudi Prince: పాక్ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ప్రిన్స్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ దేశంలో ఇటీవల భీకరమైన వరదలు సంభవించాయి. ఆ వరదల వల్ల పాక్ దేశం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. దీంతో పాక్ కు సాయం చేసేందుకు సౌదీ రాజు ముందుకు వచ్చారు. అందుకే పాక్ లో పెట్టుబడులు పెట్టేందుకు సమాయత్తమవుతున్నారు.

పాకిస్థాన్ దేశంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సౌదీ సిద్ధమైంది. మొదట ఆ దేశ సెంట్రల్ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్న డబ్బును 3 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్లకు పెంచేందుకు సౌదీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పాక్ లో పెట్టుబడులను 10 బిలియన్ డాలర్లకు పెంచనున్నట్లు మంగళవారం ప్రకటన చేసింది.

పెరిగిపోతున్న ద్రవ్యోల్బనం వల్ల, విదేశీ మారక నిల్వల వల్ల పాక్ లో ఆర్థిక పరిస్థితి మందగించింది. దీంతో పాటుగా పాక్ లో వరదలు చుట్టుముట్టాయి. మొత్తంగా పాక్ దేశంలో వరదలు ఎక్కువయ్యి 2022లోనే తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో సౌదీ పాక్ ను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అమెరికా కూడా గతంలో పాక్ కోసం పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది.

రోజురోజుకూ ఆర్థిక సమస్యలు ఎక్కువవుతున్న తరుణంలో పాక్ దేశం తన మిత్ర దేశాల వద్ద 10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సహాయాన్ని అందుకున్నట్లు తెలిపింది. అలాగే విదేశీ మాదక నిల్వలు కూడా 5.3 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో పాక్ ఇతర దేశాల వద్ద అప్పులు చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పాక్ ను ఆదుకునేందుకు సౌదీ మరో అడుగుముందుకు వేసింది.

Exit mobile version