Site icon HashtagU Telugu

Saudi Expo 203: ఎక్స్‌పో 2030 ద్వారా సౌదీలో 2,50,000 ఉద్యోగాలు

Saudi Expo 203

Saudi Expo 203

Saudi Expo 203: రియాద్‌లో నిర్వహించనున్న ఎక్స్‌పో 2030లో సౌదీ అరేబియా 250,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని పర్యాటక మంత్రి అహ్మద్ అల్ ఖతీబ్ తెలిపారు. రియాద్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభమైన మొదటి గ్లోబల్ లేబర్ మార్కెట్ కాన్ఫరెన్స్ లో మంత్రి ప్రసంగించారు.

గ్లోబల్ ఎక్స్‌పో కారణంగా 2.5 లక్షల ఉద్యోగావకాశాల్లో హోటల్ రంగానికి సంబంధించి దాదాపు 1,000 ఉద్యోగాలు ఉంటాయి. ప్రపంచ జాబ్ మార్కెట్‌లో ట్రావెల్ అండ్ టూరిజం రంగం 10 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, కరోనాకు ముందు ఈ రంగంలో 2019లో 330 మిలియన్ల ఉద్యోగాలు ఉన్నాయని, అయితే కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు మరియు హోటళ్లు ఎక్కువగా ప్రభావితమయ్యాయని మంత్రి చెప్పారు. 60 లక్షల మంది ఉపాధి కోల్పోయని ఆయన అన్నారు.అంతకుముందు మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి అహ్మద్ అల్రాజి సదస్సును ప్రారంభించారు. 40 కంటే ఎక్కువ దేశాల నుండి 6,000 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

Also Read: Forbes List 2023: ఫోర్బ్స్ జాబితాలోకి లిక్కర్ కింగ్