Site icon HashtagU Telugu

India-Saudi: మోదీ పిలుపుతో యుద్ధం ఆపేసిన సల్మాన్ రాజు..

India-Saudi

New Web Story Copy (49)

India-Saudi: ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో గత కొన్ని రోజులుగా అంతర్యుద్ధం నడుస్తోంది. దీని కారణంగా వేలాది మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. భారతీయులు స్వదేశానికి క్షేమంగా తిరిగి రావడం కోసం ఆపరేషన్ కావేరీని నిర్వహిస్తుంది భారతప్రభుత్వం. ఈ ఆపరేషన్ కింద సూడాన్ నుండి వందలాది మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. సౌదీ అరేబియా కూడా భారతీయులను సుడాన్ నుండి బయటకు తీసుకొచ్చేందుకు సహాయసహకారాలు అందిస్తుంది. ఇప్పటికే సౌదీ అరేబియా చాలా మంది భారతీయులను అక్కడి నుంచి ఖాళీ చేయించింది. గల్ఫ్ దేశం భారత్‌కు సాయం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆపరేషన్ రాహత్ కింద సౌదీ భారతదేశానికి సహాయం చేసింది.

2015లో సల్మాన్ బిన్ సౌదీకి రాజుగా నియమితులయ్యారు. అదే సమయంలో యెమెన్‌లోని హుతీ తిరుగుబాటుదారులపై యుద్ధం ప్రకటించారు. యుద్ధం కారణంగా భారత్‌తో పాటు అనేక దేశాల పౌరులు యెమెన్‌లో చిక్కుకుపోయారు. యుద్ధంతో అతలాకుతలమైన యెమెన్ నుంచి వేలాది మంది భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ రాహత్ ప్రారంభించింది ఇండియా. 2015 ఏప్రిల్ 1న ఆపరేషన్ రాహత్ ప్రారంభించారు. యెమెన్‌లో బాంబు దాడులు జరుగుతున్నాయి మరియు వేలాది మంది భారతీయులు అక్కడ చిక్కుకున్నారు. దీంతో మోడీ రంగంలోకి దిగి సౌదీ రాజుతో మాట్లాడారు. మోడీకి సల్మాన్ తో ఉన్న స్నేహబంధం కారణంగా సల్మాన్ రాజు సానుకూలంగా స్పందించారు. దీంతో యెమెన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించడంలో సౌదీ రాజుతో ప్రధాని మోదీ స్నేహం ఉపయోగపడింది.

సౌదీ రాజుతో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. సల్మాన్ మోదీ నుంచి కొంత సమయం కోరారు. తర్వాత సౌదీ రాజు మోడీకి ఫోన్ చేసి రోజూ రెండు గంటల పాటు యుద్దాన్నివారం రోజులు ఆపగలం అని చెప్పాడు. ప్రధాని పిలుపు మేరకు సౌదీ ప్రతిరోజూ రెండు గంటలపాటు యుద్ధాన్ని నిలిపివేసింది. అంతేకాకుండా సౌదీలోని విమానాశ్రయం నుండి భారతదేశానికి రెండు గంటల పాటు పాసేజ్ కూడా ఇచ్చారు. ఆపై ఐదు వేల మందికి పైగా పౌరులను సురక్షితంగా తరలించారు.

Read More: Sex Toys Offer: రాజకీయ పార్టీ క్రేజీ ఆఫర్.. ఓటర్లకు ‘సెక్స్ టాయ్స్’