Site icon HashtagU Telugu

Saudi Arabia : భారతీయులకు సౌదీ అరేబియా షాక్…స్థానికులకే పెద్దపీట..!!

Saudi

Saudi

భారతీయులకు సౌదీ అరేబియా షాకిచ్చింది. సౌదీలో ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి ఇది బ్యాడ్ న్యూస్. కన్సల్టెన్సీ ఉద్యోగాల్లో 40శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సౌదీ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో భారత్ తో సహా వలస వచ్చిన వారందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. భారత్ నుంచి ఏటా సౌదీ వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది.

కాగా సౌదీ అరేబియా మానవ వనరులు,సామాజిక అభివ్రుద్ధి మంత్రిత్వ శాఖ వచ్చే ఏడాది 2023 నుంచి కన్సల్టేన్సీ ఉద్యోగాల్లో 35శాతం ఉద్యోగాలు స్ధానికులకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రెండో దశలో దీన్ని 40శాతానికి పెంచనున్నారు. హ్యూమన్ రిసోర్సెస్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం..వచ్చే ఏడాది ఏప్రిల్ 6, 2023 నుంచి కన్సల్టెన్సీ వృత్తిలో35శాతం ఉద్యోగాలు స్ధానికులకే ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 2024 మొదటి త్రైమాసికంలో 40శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించింది.

భారత్ కు ఎదురుదెబ్బ
వాస్తవానికి సౌదీలో విదేశీ కార్మికులతో పోల్చితే భారతీయులే గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. భారత యువకులు హోటల్, మైనింగ్ రంగాల్లో ఉద్యోగాల కోసం సౌదీ వెళ్తుంటారు. స్థానిక రిజర్వేషన్లో భారతీయులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. భారత్ నుంచి ఉద్యోగాల కోసం సౌదీకి ఏటా మిలియన్ల కొద్దీ మంది వెళ్తారు. విదేశాంశమంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన డేటా ప్రకారం..కోవిడ్ లాక్ డౌన్ లో సౌదీ అరేబియా నుంచి 1లక్ష18వేల మందికిపై భారత్ కు తిరిగి వచ్చారు.

సౌదీ ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో…
సౌదీలో నిరుద్యోగం రేటు 9శాతం కంటే ఎక్కువగా ఉంది. ఈ నిర్ణయంతోనే సౌదీ పౌరులకు మరిన్ని ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాపార సలహాదారులు, ప్రాజెక్టు నిర్వహణ నిపుణులు వంటి రంగాలపై దీని ప్రభావం చూపుతుంది. సౌదీ ఆర్దిక మంత్రి ముహమ్మద్ అల్ జాదన్ కన్సల్టెన్సీ ఉద్యోగాల్లో సేవా నిబంధనలను సవరణ జారీ చేవారు. స్థానికీకరణ శాతాన్ని పెంచాలని అన్ని కంపెనీలను కోరారు.