Mobile Recharge Rs 50000: ప్రపంచంలోనే సంపన్నుడు ఎలాన్ మస్క్. ఆయన కంపెనీ ‘స్టార్ లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. త్వరలోనే భారత్‌లోనూ దాని సేవలు ప్రారంభమవుతాయని అంటున్నారు. ఈ తరుణంలో ఒక షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. స్టార్ లింక్ అందించే శాటిలైట్ ఇంటర్నెట్ సేవల రీఛార్జ్ ధరల వివరాలు బయటికి వచ్చాయి. వాటి గురించి వింటే దిమ్మ తిరగాల్సిందే.
భారత్ కంటే ముందుగా పాకిస్తాన్‌లోనే స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అక్కడ జనాభా తక్కువ (24 కోట్లే). టెలికాం రంగాన్ని నియంత్రించే రూల్స్ కూడా తక్కువే. అందుకే అక్కడ త్వరలోనే స్టార్‌లింక్ కంపెనీకి పూర్తిస్థాయి అనుమతులు లభించే ఛాన్స్ ఉంది.
Also Read :Rahul Gandhi: అకస్మాత్తుగా వరంగల్‌కు రాహుల్‌గాంధీ .. కారణం ఏమిటి ?
నెలకు రూ.50వేల రీఛార్జ్
స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ రీఛార్జ్(Mobile Recharge Rs 50000) ప్లాన్లపై పాకిస్తానీ మీడియాలో బాగానే ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన నెలవారీ రీఛార్జ్ ప్లాన్ కోసం రూ.50వేల పాకిస్తానీ రూపాయలను చెల్లించాలి. వీటిని మన భారతీయ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే రూ.16వేలు అవుతాయి. స్టార్ లింక్‌కు ఇంత భారీ ధర చెల్లించి నెలవారీ రీఛార్జ్ చేసుకుంటే.. 50 నుంచి 250 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. ఈ సేవను ఉపయోగించడానికి అవసరమైన స్టార్ లింక్ హార్డ్‌వేర్ కోసం 1.20 లక్షల పాకిస్తానీ రూపాయలను అదనంగా కట్టాలి.
నెలకు రూ.35వేల రీఛార్జ్
రెసిడెన్షియల్ ప్యాకేజీ కోసం నెలకు రూ. 35,000 కట్టి రీఛార్జ్ చేయించుకోవాలి. ఈ ప్లాన్లు వినియోగించే వారు స్టార్ లింక్ హార్డ్‌వేర్ కోసం అదనంగా 1.10 లక్షల పాకిస్తానీ రూపాయలను స్టార్ లింక్‌కు చెల్లించాలి.
నెలకు రూ.95వేల రీఛార్జ్
బిజినెస్ ప్యాక్ కోసం నెలకు రూ. 95,000 చెల్లించి రీఛార్జ్ చేసుకోవాలి. ఇందులో 100 నుంచి 500 ఎంబీపీఎస్ స్పీడ్ వస్తుంది. దీనికి సంబంధించిన హార్డ్ వేర్ కోసం స్టార్ లింక్ కంపెనీకి 2.20 లక్షల పాకిస్తానీ రూపాయలు చెల్లించాలి.
జనాదరణ కష్టమే
ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. అక్కడి ప్రజలు పేదరికంలో ఉన్నారు. ఈ తరుణంలో ఇంత కాస్ట్లీ ఇంటర్నెట్ సేవలను సబ్ స్క్రయిబ్ చేసుకుంటారా ? అనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంది. ప్రజలు దాన్నే వాడుకుంటారు కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో భారీగా డబ్బులు ఖర్చు చేసి ఇంటర్నెట్ సేవలు పొందేందుకు ప్రయత్నించరు.