Sam Pitroda : కాంగ్రెస్ చైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా

భారతీయులు “దక్షిణాదిలో ఆఫ్రికన్‌ల వలె కనిపిస్తారు – పశ్చిమాన ఉన్నవారు అరబ్బులు – తూర్పున ఉన్నవారు చైనీస్‌లా కనిపిస్తారు.” అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు

  • Written By:
  • Publish Date - May 8, 2024 / 08:10 PM IST

కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా ..కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. లోక్‌స‌భ‌ ఎన్నికల నేపథ్యంలో శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇండియన్స్ ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. అమెరికాలో తాను రేకెత్తించిన వారసత్వ పన్ను వ్యాఖ్యల మంటలను ఆర్పే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులు “దక్షిణాదిలో ఆఫ్రికన్‌ల వలె కనిపిస్తారు – పశ్చిమాన ఉన్నవారు అరబ్బులు – తూర్పున ఉన్నవారు చైనీస్‌లా కనిపిస్తారు.” అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ వ్యాఖ్యలపై బిజెపి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. ప్రధాని మోడీ సైతం దీనిపై స్పందించారు. దేశాన్ని విభజించి పాలించాలని కాంగ్రెస్ అనుకుంటోంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. శరీర రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే దాన్ని తాము సహించమని హెచ్చరించారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎటువైపు తీసుకెళ్ళాలని చూస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో చాలా మంది ప్రజలు నల్లగా ఉంటారు. దాని ఆధారంగా ఆ వ్యక్తి యోగ్యతను నిర్ణయిస్తారా? శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపు అని గుర్తించాలని మోడీ తెలిపారు. ఈరోజు వరంగల్ మామునూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో భాగంగా మోడీ శ్యామ్ పిట్రోడా కలర్ వ్యాఖ్యలపై స్పందించారు.

ఇలా రోజు రోజుకు తాను చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికి గురి చేస్తుండడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి..తన రాజీనామా లేఖను ఖర్గే కు పంపగా..దానిని ఆయన ఆమోదించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ దీనిపై సమాచారం ఇచ్చారు. తన ఇష్టానుసారం శామ్ పిట్రోడా ఈ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే ఆమోదించారు అని జైరామ్ రమేశ్ వెల్లడించారు.

Read Also : Shyamala Devi : జనసేన, బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న ప్రభాస్ పెద్దమ్మ.. నరసాపురంలో గెలుపు పక్కా..