Vladimir Putin : అమెరికాకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం వార్నింగ్ ఇచ్చారు.!

Russia రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా కక్షగడుతోంది. వారిని కొననివ్వకుండా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా భారత్‌పై ఒత్తిడి తేవాలని చూస్తోంది. ఇటీవల జీ7 దేశాలు కూడా రష్యాకు సహాయపడుతున్న దేశాలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్‌పై ఒత్తిడి తెస్తున్న అమెరికాకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం వార్నింగ్ ఇచ్చారు. తనను ఎవరిముందైనా అవమానించడం భారత్ ఎప్పటికీ ఒప్పుకోదన్నారు. ప్రధాని మోదీ చాలా తెలివైన […]

Published By: HashtagU Telugu Desk
narendra modi, vladimir putin

narendra modi, vladimir putin

Russia రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా కక్షగడుతోంది. వారిని కొననివ్వకుండా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా భారత్‌పై ఒత్తిడి తేవాలని చూస్తోంది. ఇటీవల జీ7 దేశాలు కూడా రష్యాకు సహాయపడుతున్న దేశాలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్‌పై ఒత్తిడి తెస్తున్న అమెరికాకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం వార్నింగ్ ఇచ్చారు. తనను ఎవరిముందైనా అవమానించడం భారత్ ఎప్పటికీ ఒప్పుకోదన్నారు. ప్రధాని మోదీ చాలా తెలివైన నాయకుడని.. ఆయన దేశం కోసం ఆలోచిస్తారన్నారు.

మోదీ అలాంటి నిర్ణయాలు తీసుకోరు. నల్ల సముద్రంలోని సోచి రిసార్ట్ నగరంలో జరిగిన వాల్డాయ్ డిస్కషన్ గ్రూప్‌ సమావేశంలో పుతిన్ మాట్లాడారు. “భారత్ మన ఇంధన వనరులను వదులుకుంటుందా? అలా జరిగితే.. మనం కొన్న నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. కొందరు ఆ నష్టాన్ని దాదాపు 9 నుంచి 10 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కానీ భారత్ మన చమురును కొనడం ఆపకపోతే.. ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నష్టం కూడా ఆ మేరకే ఉంటుంది. భారత ప్రజలుతమను తాము ఎవరిచేత అవమానించబడటానికి ఎప్పటికీ ఒప్పుకౌరు. ప్రధాని మోదీ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోరు” అని పుతిన్ అన్నారు.

అమెరికా విధించిన సుంకాల వల్ల భారత్ ఎదుర్కొంటున్న నష్టాలను. రష్యా చమురు దిగుమతుల ద్వారా బ్యాలన్స్ చేయొచ్చని పుతిన్ అన్నారు. అంతేకాకుండా భారత్ సార్వభౌమ దేశంగా మరింత ప్రతిష్టను పొందుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని పుతిన్ ప్రశంసించారు. ఆయనను బ్యాలన్స్‌డ్, తెలివైన, జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకుడు అని అభివర్ణించారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక సంబంధం ఉందన్న పుతిన్.. భారత ప్రజలు దీన్ని మరచిపోరని నేను నమ్ముతున్నాన్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం.. తాము ఒక ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్టన‌ర్‌షిప్ గురించి ఒక ప్రకటన చేశామని.. అదే ఇరు దేశాల సంబంధాలకు సరైన నిర్వచణం అని అన్నారు.

  Last Updated: 03 Oct 2025, 01:49 PM IST