Site icon HashtagU Telugu

Missile Strikes Near Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడికి తృటిలో త‌ప్పిన ప్రాణ‌పాయం

Missile Strikes Near Zelensky

Volodymyr Zelenskyy

Missile Strikes Near Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ (Missile Strikes Near Zelensky)పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఒడెస్సాలోని నల్ల సముద్రం సమీపంలోని ఓడరేవులో గ్రీకు ప్రధాని కిరియాకోస్ మిస్టోటాకిస్‌తో కలిసి ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. ఈ దాడిలో జెలెన్స్కీ తృటిలో తప్పించుకున్నాడు. తాను క్షిపణికి చాలా దగ్గరగా ఉన్నానని, దానిని చూశానని, దాని శబ్దం తనకు వినిపించిందని జెలెన్స్కీ చెప్పారు. ఈ దాడిలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. దీంతో పాటు పలువురికి గాయాలయ్యాయి.

ఈ రోజు దాడిని చూశామని జెలెన్స్కీ చెప్పారు. “ఈ రోజు ఈ సంఘటన చాలా నష్టాన్ని కలిగించిందని నాకు తెలుసు. నా దగ్గర ఇంకా అన్ని వివరాలు లేవు. కానీ చాలా మంది మరణించారు. గాయపడినట్లు నాకు తెలుసు” అని బుధవారం ఒడెస్సాలో జెలెన్స్కీ చెప్పారు. మనం ముందుగా మనల్ని మనం రక్షించుకోవాలి. దానికి ఉత్తమ మార్గం బలమైన వాయు రక్షణ వ్యవస్థ అని అన్నారు.

Also Read: Anant-Radhika: అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వేడుకలో ఎవ‌రెంత తీసుకున్నారంటే..?

రష్యా- ఉక్రెయిన్ మధ్య రెండు సంవత్సరాలకు పైగా యుద్ధం జరుగుతోంది. రష్యా ఇంతకుముందు చాలాసార్లు ఒడెస్సాను లక్ష్యంగా చేసుకుంది. అంతకుముందు ఆదివారం రష్యా ఒడెస్సాలో డ్రోన్‌తో విధ్వంసం సృష్టించింది. ఇందులో ఓ అమాయకుడు, రెండేళ్ల చిన్నారి సహా ఏడుగురు మృతి చెందగా, మూడేళ్ల బాలికతో సహా 8 మంది గాయపడ్డారు.

ఇరాన్‌ సరఫరా చేసిన షాహీద్‌ డ్రోన్‌ల ద్వారా ఈ దాడి జరిగిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడికి సైనిక ప్రాముఖ్యత లేదని, కేవలం ప్రజలను హతమార్చేందుకు మాత్రమే దాడి చేశారన్నారు. ఉక్రెయిన్ ఆయుధాల సరఫరాలో జాప్యాన్ని ఎదుర్కోకపోతే దాడిని నివారించవచ్చని జెలెన్స్కీ చెప్పారు.

We’re now on WhatsApp : Click to Join