Site icon HashtagU Telugu

Russian Attack 22 Killed:ఉక్రెయిన్ పై రష్యా దాడి 22 మంది మృతి

Russian Attack

Russian Attack

తాజాగా ఉక్రెయిన్‌ రైల్వే స్టేషన్ పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ మెరుపు దాడిలో 22 మంది మృతి చెందారు. 50 మందికిపైగా గాయపడ్డారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు వీడియో ప్రసంగంలో జెలెన్ స్కీ మాట్లాడుతూ, తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత డోనెట్స్క్‌కు పశ్చిమాన 145 కి.మీ (90 మైళ్లు) దూరంలో ఉన్న చాప్లిన్ అనే చిన్న పట్టణంలో రష్యా రాకెట్లు రైలును ఢీకొన్నాయని చెప్పారు. నాలుగు క్యారేజీలు అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత వినాశకరమైన సంఘర్షణ ఇది అన్నారు. రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడి మొదలు పెట్టిన ఆరునెలల వ్యవధిలో తమ దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున రష్యా చేసిన ఈ దాడి అసహ్యమైనదన్నారు. తమను రెచ్చగొట్టే విధంగా ఉందని అన్నారు. రష్యా చేసిన ప్రతి దానికీ ఆ దేశం బాధ్యత వహించేలా చేస్తామన్నారు.