Ukraine war: రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడి

రష్యాలోని రెండు వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి.

  • Written By:
  • Updated On - December 6, 2022 / 09:58 AM IST

రష్యాలోని రెండు వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలైనట్లు రాయిటర్స్ తెలిపింది. రెండు విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అటు అదే సమయంలో, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఉక్రెయిన్ సైనిక, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేసినట్లు సమాచారం.

పశ్చిమ రష్యాలోని రియాజాన్‌లోని వైమానిక దళ స్థావరం వద్ద సోమవారం తెల్లవారుజామున ఇంధన ట్రక్కు పేలిందని, ముగ్గురు సైనికులు మరణించారని, మరో నలుగురు గాయపడ్డారని, ఒక విమానాన్ని ధ్వంసం చేశారని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ RIA నోవోస్టి పేర్కొంది. రష్యా సైన్యం ఉక్రెయిన్‌లో క్షిపణులను పేల్చినట్లు సమాచారం. మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. రష్యాకు చెందిన వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడి చేయడంతో దానికి ప్రతిగా రష్యా ఉక్రెయిన్‌పై మిసైళ్ళ వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌లోని విద్యుత్ స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఉక్రెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

మరోవైపు.. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో రష్యా గోధుమ పంటలను హార్వెస్ట్ చేస్తున్నట్లు నాసాకు ఫుడ్ సెక్యూరిటీ టీం వెల్లడించింది. సుమారు 1 బిలియన్ డాలర్లు విలువ చేసే 5.8 టన్నుల పంటను హార్వెస్ట్ చేసిందని తెలిపింది. అయితే మిగిలిన పంటను కూడా రష్యా హార్వెస్ట్ చేస్తుందా ? లేదా అనేది తెలపలేదు.