Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హ్యారీ పోటర్ కోట ధ్వంసం

హ్యారీ పోటర్ సిరీస్ లో ఓ భారీ కోట అందరికి తెలిసే ఉంటుంది. ఆ భవనం ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరంలో ఉంది. ఇప్పుడు ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా నాశనం అయింది. ఈ విద్యా సంస్థ భవనంపై రష్యన్ క్షిపణి దాడి చేసింది.

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆ రెండు రాష్ట్రాలను మరో వందేళ్లు వెనక్కి నెట్టింది. ఇరు దేశాల అధిపతుల ఇగో కారణంగా రెండు దేశాల ప్రజలు చిన్నాభిన్నం అవుతున్నారు. యుద్ధం మొదలై సంవత్సరం దాటినా ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. ఈ యుద్ధం కారణంగా రెండు దేశాల ప్రజలే కాదు భారీగా సంపద ధ్వంసమైంది. పురాతన కట్టడాలు నేలకూలాయి. వేలాది మంది సైనికులు మరణించారు. భారీ ప్రాణనష్టం జరిగింది. అయితే తాజాగా జరిగిన దాడిలో హ్యారీ పోటర్ కోట ధ్వంసమైంది.

We’re now on WhatsAppClick to Join

ఒకప్పుడు హ్యారీ పోటర్ సిరీస్ అంటే ఎగబడి చూసేవారు. మాయలు, మంత్రాలతో సిరీస్ ఆద్యంతం ప్రతిఒక్కరిని అబ్బురపరిచేది. ముఖ్యంగా పిల్లలు అయితే సిరీస్ ని చాలా ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళు. అయితే ఆ సిరీస్ లో ఓ భారీ కోట అందరికి తెలిసే ఉంటుంది. ఆ భవనం ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరంలో ఉంది. ఇప్పుడు ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా నాశనం అయింది. ఈ విద్యా సంస్థ భవనంపై రష్యన్ క్షిపణి దాడి చేసింది. దాడి జరిగిన వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు అంతేకాదు ఓ గర్భిణి, ఇద్దరు చిన్నారులు సహా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో ఏకకాలంలో 20 నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని.. ఈ క్షిపణి ల్యాండ్ అయిన ప్రదేశానికి 1.5 కిలోమీటర్ల వరకు శకలాలు పడిపోయాయని ప్రత్యక్ష ఆధారాలు చెబుతున్నాయి.

Also Read: Summer Care: ఎండాకాలంలో అదే పనిగా టీ, కాఫీ తాగుతున్నారా.. అయితే జర జాగ్రత్త