Site icon HashtagU Telugu

Russia-Ukraine War: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ప్ర‌పంచ విప‌త్తు ఖాయం..!

Putin Agrees To China Visit

Putin

నాటో దళాలు త‌మ‌తో నేరుగా త‌ల‌ప‌డితే ప్ర‌పంచ విప‌త్తు త‌ప్ప‌ద‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్ర‌వారం హెచ్చ‌రించాడు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దురాక్ర‌మ‌ణ‌ను నిర‌సిస్తూ ఐక్య‌రాజ్య స‌మితి సాధార‌ణ అసెంబ్లీలో బుధ‌వారం అర్థ‌రాత్రి ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానం నెగ్గిన నేప‌థ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్య‌లు పెను సంచ‌ల‌నగా మారాయి. ఐక్య‌రాజ్య స‌మితిలో ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానంపై 193 స‌భ్య‌దేశాల‌కు గాను 143 దేశాలు ర‌ష్యాకు వ్య‌తిరేకంగా ఓటువేశాయి. అయితే.. ఈ తీర్మానంపై భార‌త్ త‌ట‌స్థ‌వైఖ‌రిని అనుస‌రించి దూరంగా ఉంది.

అయితే.. ర‌ష్యా నుంచి ర‌క్ష‌ణ కోసం ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో ర‌ష్యా హెచ్చ‌రిక‌లు కూడా చేసింది. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకుంటే మూడో ప్ర‌పంచ‌యుద్ధం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది ర‌ష్యా. అంతేకాకుండా ఉక్రెయిన్‌పై దాడుల‌ను మరింత ముమ్మ‌రం చేసింది. గడిచిన రోజులో ఉక్రెయిన్ 40 ప్రాంతాల‌పై ర‌ష్యా క్షిప‌ణులు దాడులు చేసిన విష‌యం తెలిసిందే.

అయితే ర‌ష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ముక్క‌ప‌చ్చ‌లార‌ని చిన్నారులు నలిగిపోతున్నారు. బిడ్డ‌లను కాపాడుకునేందుకు బంక‌ర్ల‌లో దాచిపెడుతున్న త‌ల్లుల క‌ష్టాలు మ‌రోలా ఉన్నాయి. శ‌త్రుసైనికులు చుట్టుముట్టి పసివాళ్ల‌ను అప‌హరిస్తుండ‌టంతో వారి జాడ ఎంత‌కీ తెలియ‌టం లేద‌ని త‌ల్లులు రోదిస్తున్నారు. వేలాది మంది చిన్నారులు డాన్‌బాస్ ప్రాంతంలోని ర‌ష్యా శిబిరాల్లో ఉన్న‌ట్లు పేర్కొంది. వీరిని పెంచుకునేందుకు ఆస‌క్తి చూపిన ర‌ష్యా కుటుంబాల‌కు ద‌త్త‌త ఇస్తున్న‌ట్లు స‌మాచారం.