Russia- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో (Russia- Ukraine War) 6 లక్షల మందికి పైగా రష్యా సైనికులు మరణించారు. ఉక్రెయిన్ వెబ్‌సైట్ కీవ్ ఇండిపెండెంట్ ప్రకారం.. 24 ఫిబ్రవరి 2022న ఉక్రెయిన్‌పై దాడి జరిగినప్పటి నుండి 6,03,010 మంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ తెలిపారు. గత రెండున్నర సంవత్సరాల్లో ఉక్రెయిన్ 8,522 రష్యన్ ట్యాంకులు, 16,542 సాయుధ వాహనాలు, 17,216 ఆర్టిలరీ సిస్టమ్స్, 1,166 రాకెట్ సిస్టమ్స్, 928 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, 367 ఎయిర్‌ప్లేన్స్, 328 హెలికాప్టర్లు, 13,902 డ్రోన్లు, ఉక్రెయిన్ నాశనం చేసిందని జనరల్ సిబ్బంది టెలిగ్రామ్‌లో తెలిపారు. మంగళవారం నాడు 1,210 మంది రష్యా సైనికులు మరణించారని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో మంగళవారం 2,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించారని రష్యా సైన్యం సోషల్ మీడియాలో పేర్కొంది.
కుర్స్క్‌లో జరిగిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్ డిమిత్రి మెద్వెదేవ్, ఉక్రెయిన్- రష్యా మధ్య చర్చలకు అన్ని దారులు మూసుకుపోయాయని అన్నారు. పుతిన్ కంటే ముందు మెద్వెదేవ్ రష్యా అధ్యక్షుడిగా ఉన్నారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా ఓడించే వరకు చర్చల వల్ల ప్రయోజనం లేదని సోషల్‌మీడియాలో పేర్కొన్నారు.
Also Read: BCCI: భారీగా పెరిగిన బీసీసీఐ ఆదాయం.. 2023లో రూ.5,120 కోట్ల లాభం..!
నిజానికి గత రెండున్నరేళ్లుగా రష్యా దురాక్రమణను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ ఆర్మీ ఇప్పుడు ఎదురుదాడికి దిగింది. ఆగష్టు 6న ఉక్రెయిన్ రష్యాలోని కుర్స్క్ ప్రాంతంపై దాడి చేసింది. అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకారం.. గత 15 రోజుల్లో ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని కుర్స్క్‌లో 92 గ్రామాలను స్వాధీనం చేసుకుంది. 1250 చదరపు కిలోమీటర్ల రష్యా భూభాగాన్ని ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయని అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ ఆర్మీ ఛీఫ్ అలెగ్జాండర్ సిర్‌స్కీ మాట్లాడుతూ ఉక్రెయిన్ సైన్యం రష్యా లోపల 35 కి.మీ. BBC ప్రకారం.. ఉక్రెయిన్ ఆకస్మిక దాడి తరువాత 2 లక్షల మందికి పైగా రష్యన్ పౌరులు తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
ఉక్రెయిన్ కుర్స్క్‌లోని మూడవ వంతెనను కూడా ధ్వంసం చేసింది
మరోవైపు కుర్స్క్‌లో నిర్మించిన మూడో వంతెనను కూడా ఉక్రెయిన్ సైన్యం కూల్చివేసింది. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ మైకోలా ఒలేష్‌చుక్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ వంతెనలన్నీ కుర్స్క్‌లోని గ్లుష్కోవ్స్కీ జిల్లాలో సెమ్ నదిపై నిర్మించబడ్డాయి. అల్ జజీరా ప్రకారం.. ఈ వంతెనలన్నీ కూలిపోవడం రష్యా సరఫరా లైన్‌పై ప్రభావం చూపుతుంది.