ఉక్రెయిన్ (Ukraine ) కు సాయం చేస్తున్నవారిపై రష్యా కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశానికి 51 డాలర్లు (రూ.4200) విరాళం ఇచ్చినందుకు US-రష్యన్ మహిళ ఖవానాకు కోర్టు ఏకంగా 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఎక్కడైనా ప్రకృతి విపత్తు, అనుకోని ప్రమాదాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లితే వాళ్లను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు. తమకు తోచిన సాయం అందిస్తుంటారు. అలా సాయం చేసిన వారిని దేవుళ్లలా చూస్తారు. ఇటీవల రష్య, ఉక్రెయిన్, ఇజ్రాయల్ దేశాల్లో యుద్దం కొనసాగుతుంది.యుద్ద ప్రభావంతో ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. ప్రజల దయనీయ పరిస్థితి చూసి ఓ మహిళ జాలి చూపించింది.. వారిని ఆదుకోవడానికి తనవంతు సాయం చేసింది. ఆ సాయమే ఆమె చేసిన పెద్ద తప్పు..కేవలం నాల్గు వేలు సాయం చేసి..ఇప్పుడు 12 ఏళ్ల జైలు శిక్ష అనుభవించబోతుంది.
We’re now on WhatsApp. Click to Join.
గత కొంత కాలంగా రష్యా-ఉక్రెయిన్ ల మద్య భీకర యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు ఎక్కడ తగ్గకుండా యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ పై దురాక్రమనణ కొనసాగిస్తున్న రష్యా.. శత్రుదేశానికి ఎవరైనా సాయం అందించినా.. మద్దతు తెలిపినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. రష్యాకు చెందిన సెనియా ఖవానా ఓ డ్యాన్సర్.. ఆమె వయసు 33 సంవత్సరాలు. ఇటీవల అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో నివసిస్తుంది. ఏడాది ఫిబ్రవరిలో తన కుటుంబాన్ని కలుసుకునేందుకు సెనియా ఖవానా రష్యాకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెపై దేశ ద్రోహం కేసు నమోదు అయ్యింది. రష్యా అధికారులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. పలు దఫాలుగా విచారణ అనంతరం ఆమెకు కోర్టు 12 జైలు శిక్ష విధించారు.
Read Also : Maharashtra Big Blow: మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ, కాంగ్రెస్‌తో చేతులు కలిపిన మాజీ ఎంపీ