Russia – Palestine : ‘పాలస్తీనా’ మిలిటెంట్ గ్రూపులకు పుతిన్ పిలుపు.. ఎందుకు ?

Russia - Palestine : గతేడాది అక్టోబరు 7 నుంచి గాజా - ఇజ్రాయెల్ యుద్ధం కంటిన్యూ అవుతోంది.

  • Written By:
  • Updated On - February 17, 2024 / 03:12 PM IST

Russia – Palestine : గతేడాది అక్టోబరు 7 నుంచి గాజా – ఇజ్రాయెల్ యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఈనేపథ్యంలో రష్యా కీలకమైన ఎంట్రీ ఇచ్చింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అవసరమైన నిధులు, ఆయుధాలను అమెరికా అందిస్తోంది. అయితే గాజా కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ సంస్థ హమాస్, లెబనాన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా, యెమన్ కేంద్రంగా పనిచేసే హౌతీ మిలిటెంట్లకు ఇరాన్ దన్నుగా నిలుస్తోంది. ఇరాక్ కేంద్రంగా పనిచేసే ఖతాయిబ్ హిజ్బుల్లాకు కూడా ఇరానే ఆయుధాలు ఇస్తోంది. గాజాలో అతిపెద్ద మిలిటెంట్ సంస్థ హమాస్ కాగా.. మరో రెండు, మూడు మిలిటెంట్ సంస్థలు  కూడా అక్కడ యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మిలిటెంట్ గ్రూపులన్నీ అమెరికా సామ్రాజ్యవాద వైఖరిని.. అరబ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు అమెరికా గుడ్డిగా మద్దతు ప్రకటించడాన్ని ఖండిస్తున్నాయి. ఈనేపథ్యంలో వాటికి అండగా నిలవాలని పుతిన్(Russia – Palestine) డిసైడయ్యారనే అంచనాలు వెలువడుతున్నాయి. అందుకే మాస్కోకు రావాలంటూ పాలస్తీనా పోరాటంతో ముడిపడిన మిలిటెంట్ గ్రూపుల ప్రతినిధులకు పుతిన్ ఆహ్వానాన్ని పంపారు.

We’re now on WhatsApp. Click to Join

రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి మిఖాయిల్ బొగ్డనోవ్‌ ఈ వివరాలను ధ్రువీకరించారు.  పాలస్తీనాకు మద్దతుగా నిలిచే దాదాపు 12 మిలిటెంట్ గ్రూపులను చర్చల కోసం మాస్కోకు పిలిచామని ఆయన వెల్లడించారు.  ఫిబ్రవరి 29 నుంచి ఆ సంస్థలు అన్నింటినీ ఒకచోట కూర్చోబెట్టి చర్చలు జరుపుతామని తెలిపారు.  గాజాపై ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకార దాడిలో దాదాపు 28,775 మంది సామాన్య పౌరులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. ఈ పరిస్థితులను చూసిన పుతిన్ ఎన్నోసార్లు కాల్పుల విరమణ చేయాలని గాజా, ఇజ్రాయెల్‌లకు పిలుపునిచ్చారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఈనేపథ్యంలో ఇప్పుడు రంగంలోకి దిగిన పుతిన్.. చర్చల వేళ మిలిటెంట్ సంస్థలకు ఏం చెబుతారో వేచిచూడాలి.

Also Read : Kamal Nath – BJP : కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలోకి కమల్‌నాథ్.. ? నకుల్‌నాథ్ సిగ్నల్

పుతిన్ వల్లే నావ‌ల్ని మరణం : బైడెన్

ర‌ష్యా ప్ర‌తిప‌క్ష నేత అలెక్సీ నావ‌ల్ని మృతికి అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార‌ణ‌మ‌ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ అన్నారు. నావ‌ల్నీ మృతి వ‌ల్ల తీవ్ర ప‌ర్య‌వ‌సానాలు త‌ప్ప‌వ‌న్నారు. నావ‌ల్నీ మ‌ర‌ణంలో ఆశ్చ‌ర్యం ఏమీ లేద‌ని, కానీ ప్ర‌తిప‌క్ష నేత మృతిచెందిన తీరు ఆగ్ర‌హానికి లోను చేస్తోంద‌ని బైడెన్ తెలిపారు. నిజానికి నావ‌ల్నీకి ఏం జ‌రిగింద‌న్న అంశంపై క్లారిటీ లేద‌ని, కానీ పుతిన్, ఆయ‌న అనుచ‌రులే ఈ హ‌త్య‌కు కార‌ణం అయి ఉంటార‌ని బైడెన్ చెప్పారు. నావ‌ల్నీ మృతి చెందిన విష‌యాన్ని జైలు అధికారులు ప్ర‌క‌టించ‌గానే.. వైట్‌హౌజ్‌లో బైడెన్ మీడియాతో మాట్లాడారు.నావ‌ల్నీ మృతి పట్ల ర‌ష్యా అధికారులు త‌మ సొంత క‌థ‌లు చెబుతుంటార‌ని, కానీ ఎవ‌రూ ఎటువంటి త‌ప్పు చేయ‌వ‌ద్దు అని, నావ‌ల్నీ మృతికి పుతినే కార‌ణ‌మ‌ని బైడెన్ అన్నారు. పుతిన్ ప్ర‌భుత్వం అవినీతి, హింస‌ను నావ‌ల్నీ ధైర్యంగా ఎదుర్కొన్నార‌ని బైడెన్ తెలిపారు.