Site icon HashtagU Telugu

Russia-Ukraine: ఉక్రెయిన్‌ పై రెచ్చిపోతున్న రష్యా..!

Cropped

Cropped

ఉక్రెయిన్‌లో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోందని ఆదేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. రష్యా దాడులతో తమ దేశంలోని చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొందని తెలిపారు. శనివారం రష్యా దళాలు 36 మిసైల్స్‌ను ప్రయోగించాయని.. దీని వల్ల సుమారు 15 లక్షల మంది ప్రజలకు కరెంట్ సదుపాయం కోల్పోయినట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ 36 రాకెట్లలో చాలా వాటిని తమ సైన్యం అడ్డుకుందని ఆయన చెప్పారు.

రష్యా క్షిపణి దాడితో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలలో ఒకదానిలో అగ్నిప్రమాదం జరిగిన ఫోటోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ జతచేశారు. “శత్రువులు మనల్ని ఎలా విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనేదానికి ఈ ఫోటో ఒక ఉదాహరణ మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు. “ఇవి క్లిష్టమైన సౌకర్యాలపై హేయమైన దాడులు. ఇది ఉగ్రవాదుల లక్షణ వ్యూహం. ప్రపంచం ఈ భీభత్సాన్ని ఆపగలదు. ఆపాలని ఆయన కోరాడు. దాడులు జరిగిన ప్రదేశంలో మౌలిక సదుపాయాలను పునరుద్ధరిస్తున్న వారందరికీ జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌- రష్యాల మధ్య సుమారు 8 నెలలుగా యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

 

Exit mobile version