Oreshnik Missile : ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా దూకుడుగా ముందుకు సాగుతోంది. తొలిసారిగా ప్రమాదకర ‘ఒరెష్నిక్’ హైపర్ సోనిక్ మిస్సైళ్లను యుద్ధ రంగంలో పుతిన్ సేన మోహరించింది. తద్వారా తస్మాత్ జాగ్రత్త అనే సందేశాన్ని ఉక్రెయిన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ పంపుతున్నారు. ఇంతకీ ఒరెష్నిక్ మిస్సైల్ ప్రత్యేకత ఏమిటి ? ఇది ఏం చేయగలదు ? ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :700 Crore Loan Fraud : కువైట్ బ్యాంకుకు రూ.700 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన ప్రవాస భారతీయులు
ఒరెష్నిక్ మిస్సైల్ గురించి..
- శబ్ద వేగం కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో ఒరెష్నిక్ మిస్సైల్(Oreshnik Missile) లక్ష్యం దిశగా ప్రయాణించగలదు. ఈ స్పీడును టెక్నికల్ భాషలో ‘మాక్ 10’ అని పిలుస్తారు. ఇంత భారీ స్పీడు ఉండటం వల్ల ఈ మిస్సైల్‌ను శత్రు సైన్యాల రాడార్లు పసిగట్టడం చాలా కష్టతరం అవుతుంది.
- నవంబరు 21వ తేదీన ఒకసారి ఉక్రెయిన్‌పైకి ఒరెష్నిక్ మిస్సైల్‌తో రష్యా దాడి చేసింది. ఆ సమయంలో మాక్ 11 వేగంతో ఈ మిస్సైల్ వెళ్లిందట. ఈవిషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
- ఈ మిస్సైల్ అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. దీనిలో 6 వార్ హెడ్స్ ఉన్నాయి. ఒక్కో దాంట్లో ఆరు సబ్ మ్యూనిషన్స్ పెట్టొచ్చు.
- ఒరెష్నిక్ మిస్సైల్ ఐరోపా దేశాలలోని ప్రధాన నగరాలను కూడా చేరుకోగలదు.
- ఒరెష్నిక్ మిస్సైల్ కనిష్ఠంగా 500 కి.మీ నుంచి గరిష్ఠంగా 5,500 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
- రష్యాకు చెందిన ‘ఆర్ఎస్-26 రూబెజ్’ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ నమూనా ఆధారంగా అధునాతన టెక్నాలజీతో తయారు చేశారు.
- ఈ మిస్సైల్‌తో అండర్ గ్రౌండ్ బంకర్లను కూడా ధ్వంసం చేయొచ్చు. ఒకేసారి నాలుగు అంతస్తుల భూగర్భ బంకర్లను కూడా ఇది ధ్వంసం చేయగలదు.
Also Read :110 Murders : కొడుకుపై ‘చేతబడి’ అనుమానం.. 110 మందిని చంపించిన గ్యాంగ్ లీడర్
- ఇప్పటివరకు ఉక్రెయిన్‌పైకి రష్యా అత్యధిక సార్లు ‘కింఝాల్’ మిస్సైళ్లతో దాడులు చేసింది. లక్ష్యం దిశగా ప్రయాణించే క్రమంలో.. శత్రుదేశాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల నుంచి వచ్చే మిస్సైళ్లను ‘కింఝాల్’ తప్పించుకోగలదు. ఈ మిస్సైల్ కూడా దాదాపు మాక్ 10 స్పీడుతో ప్రయాణించగలదు. అయినప్పటికీ కొన్నిసార్లు ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దీన్ని కూల్చేయడంలో సక్సెస్ అయ్యాయి.
- కింఝాల్ మిస్సైళ్లతో పోలిస్తే ఒరెష్నిక్ మిస్సైళ్లు.. శత్రుదేశాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు చిక్కడం చాలా కష్టం. వేగంలో, వార్ హెడ్స్‌లో అత్యాధునిక టెక్నాలజీతో ఒరెష్నిక్ మిస్సైళ్లను తయారు చేశారు.