Assassination Files: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాగా జోరు మీదున్నారు. ఈసారి పాలనా కాలంలో ఆయన అన్నీ సంచలనాలే చేయాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే అమెరికా మాజీ అటార్నీ జనరల్ రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ, పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌ల హత్యలకు సంబంధించిన కీలకమైన వివరాలతో కూడిన ఫైళ్లను విడుదల చేయబోతున్నారు. ఇంకొన్ని రోజుల్లోనే ఈ ఫైళ్లను రిలీజ్ చేస్తామని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ ప్రకటించారు. ప్రస్తుతం ఆ రికార్డులను స్కాన్ చేస్తున్నామని ఆమె చెప్పారు. ఈ ఫైళ్లను స్కాన్ చేయడానికి 100 మందికిపైగా వ్యక్తులు 24 గంటలూ పనిచేస్తున్నారని తెలిపారు. దశాబ్దాలుగా పెట్టెల్లో నిల్వ ఉన్న ఈ కీలక ఫైళ్లలోని సమాచారాన్ని అమెరికా(Assassination Files) ప్రజలకు అందిస్తామని తులసీ గబార్డ్ వెల్లడించారు.
Also Read :Sati Sametha Hanuman : సతీసమేత హనుమాన్ ఆలయం.. ఎక్కడుందో తెలుసా ?
రాబర్ట్ ఎఫ్ కెనడీ హత్య గురించి..
- రాబర్ట్ ఫ్రాన్సిస్ కెనడీ 1925 నవంబరు 20న జన్మించారు. ఆయనను అందరూ RFK అని పిలిచేవారు.
- న్యాయవాదిగా కెరీర్ మొదలుపెట్టిన ఈయన.. అమెరికా రాజకీయాలను ఓ ఊపు ఊపారు.
- ఈయన అమెరికాలోని డెమొక్రటిక్ పార్టీ నేత. ప్రస్తుతం ఈ పార్టీ అమెరికాలో విపక్షంలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ అధికార రిపబ్లికన్ పార్టీకి చెందినవారు.
- 35వ అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఎఫ్ కెనడీ సేవలు అందించారు.
- రాబర్ట్ ఎఫ్ కెనడీ కూడా ఈ కెనడీ కుటుంబానికే చెందినవారు.
- అమెరికాకు 64వ అటార్నీ జనరల్‌గా ఈయన 1961 నుంచి 1964 వరకు సేవలు అందించారు.
- 1965 జనవరి నుంచి న్యూయార్క్ తరఫున సెనెటర్‌గా వ్యవహరించారు.
- 1968 జూన్‌లో ఈయన హత్య జరిగింది. డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రచారం నిర్వహిస్తుండగా ఈ మర్డర్ జరిగింది.
- డెమొక్రటిక్ పార్టీలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రాబర్ట్ ఎఫ్ కెనడీకి మరో నేత యూజీన్ మెక్ కార్థీ నుంచి ప్రధాన పోటీ ఎదురైంది.
- ఈక్రమంలోనే 1968 జూన్ 5న ఉదయం కాలిఫోర్నియా ప్రైమరీలో డెమొక్రటిక్ పార్టీ నుంచి రాబర్ట్ ఎఫ్ కెనడీ గెలిచారు. అదే రోజు అర్ధరాత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీపై సిర్హాన్ సిర్హాన్ అనే 24 ఏళ్ల పాలస్తీనా యువకుడు కాల్పులు జరిపాడు.
- సిర్హాన్ సిర్హాన్‌ను ఆ తర్వాత విచారించగా.. 1967లో అరబ్ దేశాలు – ఇజ్రాయెల్ మధ్య జరిగిన 6 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపినందుకు రాబర్ట్ ఎఫ్ కెనడీని హత్య చేశానని వెల్లడించాడు.
- సిర్హాన్ సిర్హాన్ కాల్పులు జరిపిన 25 గంటల తర్వాత చికిత్స పొందుతూ రాబర్ట్ ఎఫ్ కెనడీ చనిపోయారు.
Also Read :HCU History: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఎలా ఏర్పాటైందో తెలుసా ?
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య గురించి..
- మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1929 జనవరి 15న జన్మించారు. ఈయన తండ్రి పేరు మార్టిన్ లూథర్ కింగ్ సీనియర్.
- పౌర హక్కుల ఉద్యమాలతో ఈయన అమెరికాలో ఫేమస్ అయ్యారు.
- 1955 నుంచి చనిపోయే వరకు (1968 సంవత్సరం) మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పౌర హక్కుల కోసం పోరాటం చేశారు.
- అమెరికాలోని నల్లజాతి ప్రజల హక్కులు, స్వేచ్ఛ, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఎంతో పోరాడారు.
- ఈక్రమంలో అమెరికా ప్రభుత్వాలు ఆయన్ను ఎన్నోసార్లు జైలులో పెట్టాయి.
- కమ్యూనిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలతో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌ను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విచారించింది.
- మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా విషయాలను ఎఫ్‌బీఐ గూఢచారులు సీక్రెట్‌గా రికార్డు చేశారు.
- 1964లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌కు అమెరికా ఎఫ్‌బీఐ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. మీరు ఆత్మహత్య చేసుకునేలా చేస్తామని అందులో బెదిరించారు.
- 1964 అక్టోబరు 14న ఆయన నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. సామాజిక అసమానతల నిర్మూలనకు అహింసా మార్గంలో పోరాటం చేస్తున్నందుకు ఈ పురస్కారాన్ని మార్టిన్‌కు ప్రదానం చేశారు.
- ఆ తర్వాత అమెరికాలోని పేదరికం, వియత్నాం యుద్ధంలో అమెరికా ఓటమి గురించి మార్టిన్ గట్టిగా మాట్లాడారు.
- 1968లో ప్రజలతో కలిసి వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌ను చుట్టుముట్టాలని మార్టిన్ ప్లాన్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ‘పూర్ పీపుల్స్ క్యాంపెయిన్’ అని పేరును నిర్ణయించారు. ఈ విషయం అమెరికా ప్రభుత్వానికి తెలిసిపోయింది.
- ఈనేపథ్యంలో 1968 ఏప్రిల్ 4న టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ ప్రాంతంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకు గురయ్యారు. జేమ్స్ ఎర్ల్ రే అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడు. జేమ్స్ ఎర్ల్ రే.. జైలు నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఖైదీ. ఇతగాడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌ను ఎందుకు చంపాడు ? అతడికి సుపారీ ఇచ్చింది ఎవరు ? నేటికీ తెలియదు. మొత్తానికి ఈ కేసులో జేమ్స్ ఎర్ల్ రేకు 99 ఏళ్ల జైలుశిక్ష పడింది.