Site icon HashtagU Telugu

Road Accident in America: అమెరికాలో యాక్సిడెంట్.. తెలుగు యువతి దుర్మరణం

అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఏపీకి చెందిన యువతి ప్రాణాలు కోల్పోయింది. వేగంగా వచ్చిన పోలీస్ కారు యువతిని ఢీకొట్టటంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలిని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవిగా గుర్తించిన అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అమెరికా సియాటిల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగుకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి కందుల మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సియాటిల్ పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి యువతిని ఢీకొట్టటంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. జాహ్నవిది కర్నూలుకు చెందిన ఆధోని అని అక్కడి పోలీసులు తెలిపారు. అసలు ఆమె ఎలా చనిపోయింది? పెట్రోలింగ్ పోలీసులు వాహనం కింద ఎలా ఇరుక్కుపోయారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Republic Day: రిపబ్లిక్ డే వేడుక‌లు.. ఢిల్లీలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త

అమెరికాలో తెలుగువారు, భారతీయులు తరచూ మరణిస్తున్నారు. తుపాకీ సంస్కృతి, రోడ్డు ప్రమాదాలు ఎక్కువ మరణాలకు కారణమవుతున్నాయి. సముద్రాలు దాటి కెరీర్‌ను అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న చాలా మంది భారతీయులు ఇలా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి మరణాలతో భారతదేశంలోని తమ కుటింబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.