UK Elections : రిషి మళ్లీ గెలుస్తారా ? నేడే బ్రిటన్‌లో ఓట్ల పండుగ

బ్రిటన్​ సార్వత్రిక ఎన్నికలు ఇవాళ  జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో భారత సంతతికి చెందిన రాజకీయవేత్తలు పోటీ చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - July 4, 2024 / 03:49 PM IST

UK Elections : బ్రిటన్​ సార్వత్రిక ఎన్నికలు ఇవాళ  జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో భారత సంతతికి చెందిన రాజకీయవేత్తలు పోటీ చేస్తున్నారు. మొత్తం 650 స్థానాల్లో ఈరోజు పోలింగ్ జరగనుంది. భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ రిచ్ మండ్, నార్తల్లెర్టన్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. రిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి ఈసారి ఓటమి తప్పదనే అంచనాలు వెలువడుతున్నాయి. 14 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండిపోయిన లేబర్ పార్టీకి అధికారం దక్కొచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రధానమంత్రి పదవి రేసులో కైర్ స్టార్మర్స్ ఉంటారని భావిస్తున్నారు. మార్పు నినాదంతో లేబర్ పార్టీ చేసిన ప్రచారం ఫలించే ఛాన్స్ ఉందని అంటున్నారు. రిషి సునాక్ హయాంలో బ్రిటన్ ఆర్థికవ్యవస్థ నెమ్మదించడం, కుంభకోణాలు జరగడం, ద్రవ్యోల్బణ ప్రభావం వంటి అంశాలతో బ్రిటన్ ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ఇది ఇవాళ ఓట్ల రూపంలో(UK Elections) వ్యక్తమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఈ సవాళ్లను పరిష్కరించడం అంత ఈజీ కాకపోవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

భారత సంతతి కీలక అభ్యర్థులు వీరే.. 

బ్రిటన్‌లోని రీడింగ్ వెస్ట్  స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ అలోక్ శర్మ పోటీ చేస్తున్నారు.  ఈలింగ్ సౌతాల్ నుంచి  లేబర్ పార్టీ సీనియర్ నేత వీరేంద్ర శర్మ బరిలోకి దిగారు.  భారత సంతతికి చెందిన హర్‌ ప్రీత్, రాజేశ్ అగర్వాల్, ప్రఫుల్ నర్గుండ్, జస్ అథ్వాల్, కీత్ వాజ్, వారిందర్ జస్, బాగీ శంకర్, సత్వీర్ కౌర్, కనిష్క నారాయణ్, చంద్ర కన్నెగంటి, అమిత్ జోగియా, శైలేశ్ వారా, గగన్ మొహింద్రా, సంగీత్ కౌర్ భైల్, జగిందర్ సింగ్ వివిధ స్థానాల్లో ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా, కొందరు రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 15 మంది ఎంపీలు గెలిచారు. వారిలో చాలా మంది ఈసారి కూడా పోటీ చేస్తున్నారు. ఈదఫా భారత సంతతి ఎంపీల సంఖ్య ఇంకా పెరుగుతుందని సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా జూన్ 8న యూకేలోని 29 హిందూ సంఘాలు కలిసి ‘ది హిందూ మేనిఫెస్టో-2024’ పేరిట తమ ఏడు కీలక డిమాండ్లను విడుదల చేశారు. బ్రిటీష్ హిందువులు తమ కమ్యూనిటీ కోసం డిమాండ్లను తెరపైకి తేవడం ఇదే మొదటిసారి. 2021 జనాభా లెక్కల ప్రకారం బ్రిటన్‌లో దాదాపు 10 లక్షల మంది హిందువులు ఉన్నారు.

Also Read :Team India : టీ20 ప్రపంచకప్‌తో ఢిల్లీలోకి టీమ్ ఇండియా గ్రాండ్ ఎంట్రీ

ఇవాళ రాత్రికల్లా రిజల్ట్

గురువారం ఉదయమంతా బ్రిటన్‌లో ఓటింగ్ జరుగుతుంది. ఈరోజే రాత్రి 10 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తాయి. ఓట్ల లెక్కింపు కూడా ఆ వెంటనే ప్రారంభమవుతోంది. మొదటి ఫలితాలు కొన్ని గంటల్లోనే వస్తాయి. చాలా సందర్భాల్లో ఫలితాలు రాత్రిపూటే ప్రకటిస్తారు. మరుసటిరోజు ఉదయం 5 గంటల వరకే ఎవరు గెలిచారనేది తేలిపోతుంది. ఒకవేళ అధికార పార్టీ ఓడిపోతే.. ప్రధానమంత్రి రిషి సునాక్ వెళ్లి రాజును కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తారు. ఆ తర్వాత గెలిచిన పార్టీ నేత రాజును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అభ్యర్థిస్తారు.