Site icon HashtagU Telugu

40 Million Dollars Jackpot: రూ.328కోట్ల లాటరీ గెలిచిన మెకానిక్.. ఏప్రిల్ ఫూల్ అనుకొని నవ్వేశాడు..!

40 Million Dollars

Resizeimagesize (1280 X 720) 11zon

అమెరికాలోని అయోవా రాష్ట్రంలో డబ్యూక్‌ నగరానికి చెందిన ఎర్ల్‌ లాపే(61) అనే విశ్రాంత మెకానిక్‌ పంటపండింది. అయోవా లాటరీలో ఆయన కొన్న టికెట్‌ 40 మిలియన్‌ డాలర్ల (40 Million Dollars) (సుమారు రూ.328 కోట్లు) బహుమతికి ఎంపికైంది. దీంతో ఆయన ఆనందానికి పట్టపగ్గాల్లేవు. తాను బహుమతి గెలిచిన దాన్ని జోక్ అనుకున్నానని, ఏప్రిల్ ఫూల్ ఏమో అని బిగ్గరగా నవ్వేశానని పేర్కొన్నాడు.

ఆదివారం వారాంతం ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరూ సోమవారం కొత్త వారాన్ని ప్రారంభిస్తారు. కానీ అమెరికన్ విశ్రాంత మెకానిక్ మాత్రం కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ధనలక్ష్మి అతనికి లాటరీగా 40 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 328 కోట్లు) గెలుచుకున్నాడు. లాటరీ గెలుపొందడం గురించి చిరకాల మిత్రుడు చెప్పినప్పుడు ఎర్ల్ లెపే అతను ‘ఏప్రిల్ ఫూల్’ ఆడుతున్నాడని అనుకున్నాడు. ఎందుకంటే అతను ఆ టిక్కెట్టును ఏప్రిల్ 1వ తేదీన కొనుగోలు చేశాడు.

Also Read: Punjab Firing: భటిండా మిలిటరీ స్టేషన్‌లో విచక్షరహితంగా కాల్పులు, నలుగురు జవాన్లు మృతి

అమెరికాలోని అయోవాలోని డుబుక్ సిటీకి చెందిన 61 ఏళ్ల లప్పే మెకానిక్‌గా ఉద్యోగ విరమణ పొందాడు. తాజాగా ఆయన కొనుగోలు చేసిన ‘లోట్టో అమెరికా’ లాటరీ టిక్కెట్‌కు జాక్‌పాట్‌ తగిలింది. అతని ఆనందానికి అవధులు లేవు. సోమవారం లాటరీ ప్రధాన కార్యాలయానికి వచ్చి టికెట్‌ తీసుకున్నాడు. 29 ఏళ్ల వ్యవధిలో విడతల వారీగా రూ.328 కోట్లు ఇవ్వనున్నారు. అయితే విడతల వారీగా తీసుకోకుండా ఏకమొత్తంలో తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతనికి రూ.175 కోట్ల నగదు బహుమతి లభించనుంది.