Tehrik e Taliban: ప్రతికార దాడులు పాకిస్తాన్ అంతటా జరగాల్సిందే…టెర్రరిస్టులకు తెహ్రీక్-ఇ-తాలిబన్ ఆదేశం..!!

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 07:09 AM IST

పాకిస్తాన్ అంతటా దాడులకు పాల్పడాలని తన యోధులకు తెహ్రిక్ ఇ తాలిబాన్ ఆదేశాలు జారీచేసింది. నిజానికి పాకిస్తాన్ లోని షాబాజ్ సర్కార్, తెహ్రీక్ ఇ తాలిబాన్ మధ్య కాల్పుల ఒప్పందం ముగిసింది. నిజానికి జూన్ లో చేసుకున్న ఈ ఒప్పందాన్ని టీటీపీ రద్దు చేసింది. దీంతోపాటు పాకిస్తాన్ లో ఎక్కడైతే అక్కడ వీలైనన్ని దాడులు చేయాలంటూ తన టెర్రరిస్టులకు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నాడు జూన్ లో చేసుకున్న ఒప్పందాన్ని టీటీపీ విరమించుకుంది. పాకిస్తాన్ అంతటా దాడులు చేయాలంటూ టీటీపీ తన ఉగ్రవాదులను ఆదేశించింది. టీటీపీ ఆదేశాలపై పాక్ ప్రభుత్వం మౌనం వహించింది.

ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ లోని బన్నూ, లక్కీ మర్వాట్ ప్రాంతాల్లో సైనిక సంస్థలు నిరంతరంగా దాడులు జరుపుతున్నాయంటూ పాకిస్తాన్ తాలిబన్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కాల్పుల విమరణకు స్వస్తి పలకాలని నిర్ణయించినట్లు టీటీపీ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ముజాహిద్దిన్ కు వ్యతిరేకంగా సైనిక కార్యకాలాపాలు కొనసాగుతున్నాయని టెర్రరిస్టు గ్రూపు తన యోధులకు తెలిపింది. కాబట్టి పాకిస్తాన్ అంతటా దాడులు చేయాలని సూచించింది. టీటీపిని పాకిస్తాన్ తాలిబాన్ అని పిలుస్తుంటారు. 2007లో టీటీపీ ఉగ్రవాద సంస్థగా ఏర్పడింది. పాకిస్తాన్ అంతటా ఇస్లాం ఫండమెంటలిజాన్ని విధించడం ఈ టెర్రరిస్టు గ్రూపు లక్ష్యం.

కాల్పుల విరమణ ఉల్లంఘనపై తాము పలుమార్లు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన పట్టించుకోలేదని ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. చాలా ఓపిక పట్టాం. ఇక మా నుంచి కూడా కాల్పుల విరమణ ఉల్లంఘన జరగబోతుందంటూ హెచ్చరించారు. ప్రతీకారదాడులు పాకిస్తాన్ అంతటా జరుగుతాయని తెలిపింది. అయితే టీటీపీ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

మలాలాను కాల్చింది టీటీపీనే
2012లో నోబెల్ గ్రహీత మలాల యూసఫ్ జాయ్ పై దాడి చేసింది టీటీపీనే. పెషావర్లోని మిలటరీ ఆసుపత్రి నుంచి చికిత్స కోసం లండన్ తరలించిన సంగతి తెలిసిందే. టీటీపీ దాడికి బాధ్యత వహించింది.

కాగా మంగళవారం రావల్పిండిలో జరిగే కార్యక్రమంలో కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తన పదవిని చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో టీటీపి నిర్ణయం పెద్ద సవాలుగా మారింది.