Site icon HashtagU Telugu

Barack Obama : కమలా హ్యారిస్‌కు బరాక్ ఒబామా నో.. రంగంలోకి మిచెల్ ఒబామా !

Kamala Harris Barack Obama Us Polls

Barack Obama : అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారైంది. అయితే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరు ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మొన్నటి వరకు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. ఆయన పోటీ నుంచి వైదొలగడంతో.. తదుపరిగా ఎవరికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తన మద్దతు దేశ అధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు ఉంటుందని బైడెన్ ఇప్పటికే ప్రకటించారు. అమెరికా అధ్యక్షురాలు అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. డెమొక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్‌కు అభ్యర్థిత్వం ఇవ్వాలని భావిస్తే తాను తప్పకుండా మద్దతు అందిస్తానని బైడెన్ చెప్పారు. అయితే ఓ కీలక డెమొక్రటిక్ పార్టీ నేత నుంచి ఇంకా కమలా హ్యారిస్‌కు మద్దతు లభించలేదు. ఆయనే మాజీ అధ్యక్షుడు బరాక్  ఒబామా(Barack Obama).

We’re now on WhatsApp. Click to Join

ఈ అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యారిస్‌(Kamala Harris)ను బరిలోకి దింపినా.. ఆమె ట్రంప్‌‌పై గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయని బరాక్ ఒబామా భావిస్తున్నారట. ఈమేరకు వివరాలతో తాజాగా  న్యూయార్క్ పోస్ట్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. అందుకే ఇంకా కమలా హ్యారిస్‌కు ఒబామా మద్దతు ప్రకటించలేదని తెలుస్తోంది. మరోవైపు చాలామంది డెమొక్రటిక్ పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే కమలా హ్యారిస్‌కు మద్దతు ప్రకటించారు.

Also Read :Rains Alert: మూడురోజులు వర్షాలు.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్షసూచన

బరాక్ ఒబామా తన సతీమణి మిచెల్ ఒబామాకు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అందువల్లే ఆయన కమలా హ్యారిస్‌కు మద్దతు తెలిపేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. తన సతీమణికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరాక్ ఒబామా తెర వెనుక నుంచి ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు. అయితే డెమొక్రటిక్ పార్టీ మిచెల్ ఒబామాకు అవకాశం ఇస్తుందా ? మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశాన్ని ఒబామా కుటుంబానికి ఆ పార్టీ  కల్పిస్తుందా ? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఉదయిస్తున్నాయి. వీటికి సమాధానాలు లభించాలంటే త్వరలో జరిగే డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ వరకు వేచి ఉండాల్సిందే. ఆ కన్వెన్షన్‌లోనే డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసే అమెరికా అధ్యక్ష అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు.