Site icon HashtagU Telugu

Dinosaurs Skeleton: “సారో పాడ్” డైనోసార్ అవశేషాలు లభ్యం.. 14.5 కోట్ల ఏళ్ల కిందటిది!!

Dinosaur Skeleton

Dinosaur Skeleton

ఏనుగును మించినది..

హిప్పోపొటామస్ ను తలదన్నెంత బలమైనది..

రైనో సార్స్ కంటే ఎక్కువ కండ బలం కలిగినది..

అదే.. “సారో పాడ్” డైనో సార్!!

ఇది పూర్తిగా శాకాహారి. అంటే కేవలం వెజ్ మాత్రమే తింటుంది.

“సారో పాడ్” 25 మీటర్ల (82 ఫీట్ల) పొడవు ఉంటుంది. 14.5 కోట్ల ఏళ్ల క్రితం ఇవి భూమిపై జీవించాయట. తాజాగా “సారో పాడ్” డైనో సార్ కు చెందిన అవశేషాలు పోర్చుగల్ దేశంలోని పొంబల్ పట్టణంలో బయటపడ్డాయి. 2017లో ఓ ఇంటి నిర్మాణ పనులు జరుపుతుండగా “సారో పాడ్” డైనో సార్ కు చెందిన అవశేషాలు వెలుగు చూశాయి. వాటిని పురాతత్వ శాస్త్రవేత్తలు ఒక క్రమంలో పేర్చి చూడగా.. నాలుగు కాళ్ళు, పొడవైన మెడ, సుదీర్ఘ దేహం, వేలాడే తోక తో కలిగిన డైనోసార్ రూపం ఆవిష్కృతం అయింది. అవశేషాల ఆధారంగా ఈ డైనోసార్ల కాలం నాటి పరిస్థితులను అంచనా వేసే దిశగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.

నది ఎండిపోవడంతో..

అమెరికాలోని టెక్సాస్‌లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీని కారణంగా డైనోసార్‌ వ్యాలీ స్టేట్‌ పార్క్‌లోని పాలక్సీ నది ఎండిపోయింది. దీంతో నదిలోని పలు ప్రాంతాల్లో 11.3 కోట్ల ఏండ్ల నాటి డైనోసార్‌ పాదముద్రలు బయటపడ్డాయి. ఈ అడుగులు అక్రోకాంతోసారస్‌ అనే జాతికి చెందిన డైనోసార్‌వి అని గుర్తించారు.ఈ డైనోసార్‌ 15 అడుగుల ఎత్తు, దాదాపు 7 టన్నుల బరువు ఉంటుందని తెలిపారు.