Shock To Masood Azhar: పాకిస్తాన్‌లో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు వెంటాడి వేటాడి చంపుతున్నారు. ఈ పనిచేస్తున్నది ఎవరు ? అనేది పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఈ తరుణంలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహితుడు, బంధువు అయిన ఖారీ ఏజాజ్ ఆబిద్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మార్చి 30న పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రావిన్షియల్ రాజధాని పెషావర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈవిషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే బయటికి రానివ్వలేదు. దీంతో ఆలస్యంగా ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పెషావర్ నగరంలోని పిష్టాఖరా ప్రాంతంలో ఖారీ ఏజాజ్ ఆబిద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో ఆబిద్ సహచరుడు ఖారీ షాహిద్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
Also Read :Tahawwur Rana: కాసేపట్లో భారత్‌కు తహవ్వుర్ రాణా.. ఆ జైలులో ఏర్పాట్లు
ఉగ్రవాదులకు పాక్ సైన్యం కాపలా
పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదులు(Shock To Masood Azhar) సురక్షితంగా ఉన్నారు. వారందరికీ అక్కడి పోలీసులు, సైన్యమే కాపలా కాస్తున్నారు. మౌలానా మసూద్ అజర్ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదులకు నేరుగా పాకిస్తాన్ ఆర్మీ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ జరుగుతోంది. దీన్నిబట్టి అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదుల కోసం ఎలాంటి ప్రొటోకాల్‌ను అమలు చేస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఉగ్రవాదులను హతమారుస్తుండటం ద్వారా.. టెర్రరిస్టులంతా పాకిస్తాన్‌లో యాక్టివ్ మోడ్‌లోనే ఉన్నారని మరోసారి అందరికీ తెలిసొచ్చింది.
Also Read :Telangana Govt: వాహనదారులకు బిగ్ అలర్ట్.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!
2000 సంవత్సరం నుంచే..
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను 2000 సంవత్సరంలో మౌలానా మసూద్ అజార్ స్థాపించాడు. అప్పటి నుంచి ఆ ఉగ్రవాద సంస్థ కశ్మీరులో ఎన్నో ఉగ్రదాడులు చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సైతం ప్రత్యేక తీర్మానం ద్వారా జైషే మహ్మద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. 2019లో అజార్‌ను ‘ప్రపంచ ఉగ్రవాది’గా నియమించారు. అతడు ప్రపంచ దేశాల వాంటెడ్ ఉగ్రవాదుల లిస్టులో ఉన్నాడు.