Hijab Song: అతడొక పాప్ సింగర్. పేరు.. మెహదీ యర్రాహి. 2022 సంవత్సరంలో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆయన ఓ పాట పాడారు. ఇందుకుగానూ యర్రాహికి ఇరాన్‌లోని ఓ కోర్టు సంచలన శిక్షను విధించింది. 74 కొరడా దెబ్బలు కొట్టాలని జడ్జీ తీర్పును వెలువరించారు. దీనిపై మెహదీ యర్రాహి స్పందిస్తూ.. ‘‘స్వేచ్ఛ కోసం మూల్యాన్ని చెల్లించడానికి ఇష్టపడని వ్యక్తి స్వేచ్ఛకు అర్హుడు కాదు’’ అని వ్యాఖ్యానించారు.
Also Read :Secret Service Agent: 13 ఏళ్ల కుర్రాడికి కీలక పదవిచ్చిన ట్రంప్.. ఎందుకు ?
2023 సంవత్సరంలోనే అరెస్ట్
2022 సంవత్సరంలో హిజాబ్‌ను(Hijab Removal Song) సరిగ్గా ధరించలేదన్న అభియోగంతో మహసా అమీన్ అనే యువతిని అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి ఆమె చనిపోయిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ వార్తతో వేలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వారికి అంతర్జాతీయ సమాజం మద్దతు తెలిపింది. అయితే ఇరాన్ ప్రభుత్వం ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపింది. ఆ సమయంలోనే హిజాబ్‌కు వ్యతిరేకంగా మెహదీ యర్రాహి పాట పాడారు. దీంతో ఆయనపై వెంటనే కేసు నమోదైంది. 2023 సంవత్సరంలోనే మెహదీ యర్రాహిని పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవిచారణలో ఆయన దోషిగా తేలారు. అనంతరం తాత్కాలిక బెయిల్‌పై గత సంవత్సరం(2024లో) మెహదీ యర్రాహి రిలీజ్ అయ్యారు. ఆ కేసులో తాజాగా ఇప్పుడు ఇరాన్‌లోని రివల్యూషనరీ కోర్టు తీర్పు ఇచ్చింది. గాయకుడిని 74 కొరడా దెబ్బలు కొట్టాలని ఆదేశించింది.
Also Read :Congress : ఎమ్మెల్సీ పోల్స్‌లో కాంగ్రెస్ పరాభవానికి ముఖ్య కారణాలివే..
ఇరాన్‌లో హిజాబ్ అమలు ఇలా..
- 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం వచ్చింది.
- అప్పటి నుంచి బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి.
- హిజాబ్ విధానం బహిరంగ ప్రదేశాల్లో అమలయ్యేలా చూసేందుకు నైతిక పోలీస్ విభాగాన్ని 2005లో ఏర్పాటు చేశారు. దీన్ని ‘గస్త్-ఎ-ఇర్షాద్’ అని పిలుస్తారు.
- పౌరులు ఇస్లామిక్ విలువలను గౌరవించేలా చూడటం, సక్రమంగా దుస్తులు ధరించనివారిపై చర్యలు తీసుకోవడం అనేది ‘గస్త్-ఎ-ఇర్షాద్’ విభాగం పని.