Pakistan Women’s: మహిళల శవాలపైనా రేప్స్.. ఫ్యాక్ట్ చెక్ లో వాస్తవం వెలుగులోకి

పాకిస్తాన్‌లో (Pakistan) నెక్రోఫిలియా కేసులు పెరుగుతున్నాయని.. సమాధుల నుంచి మహిళల శవాలను తీసి మరీ రేప్ చేస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.

Pakistan Women’s : పాకిస్తాన్‌లో నెక్రోఫిలియా కేసులు పెరుగుతున్నాయని.. సమాధుల నుంచి మహిళల శవాలను తీసి మరీ రేప్ చేస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. మహిళల శవాలపై అత్యాచారం జరగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తమ కూతుళ్ల సమాధులకు తాళాలు వేస్తున్నారని వాటిలో ప్రస్తావించారు. దానికి సింబాలిక్ గా ఒక ఫోటోను కూడా చాలా మీడియా సంస్థలు న్యూస్ రిపోర్ట్ లో పబ్లిష్ చేశాయి.

‘ది కర్స్ ఆఫ్ గాడ్ – వై ఐ లెఫ్ట్ ఇస్లాం’ పుస్తక రచయిత హారిస్ సుల్తాన్ ట్వీట్ చేసిన ఒక ఫోటోను ఈ వార్తలో ప్రచురించాయి. అయితే ఆల్ట్ న్యూస్ చేసిన ఫ్యాక్ట్ చెక్ లో ఆ ఫోటోకు పాకిస్తాన్‌ (Pakistan) తో కానీ .. నెక్రోఫిలియా కేసులతో కానీ సంబంధం లేదని తేలిపోయింది. ఈ న్యూస్ రిపోర్ట్ లన్నీ చాలావరకు ANI యొక్క సిండికేట్ ఫీడ్ నుంచే వచ్చాయి. ఇక ఆ ఫోటో ఎక్కడిది అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆల్ట్ న్యూస్ ప్రయత్నించగా .. అది హైదరాబాద్‌ మాదన్నపేటలోని దరాబ్ జంగ్ కాలనీలోని మస్జిద్ ఇ సలార్ ముల్క్ ఎదురుగా ఉన్న ఖబ్రస్తాన్ లోనిదని తేలింది. అబ్దుల్ జలీల్ అనే సామాజిక కార్యకర్త ద్వారా ఈవివరాలను ఆల్ట్ న్యూస్ గుర్తించింది.

ఎవరి సమాధి ? ఎందుకు లాక్ ?

మస్జిద్ ఇ సలార్ ముల్క్ యొక్క ముఅజ్జిన్ ముక్తార్ సాహబ్ కథనం ప్రకారం.. తాళం వేసిన ఈ సమాధి అనేది మస్జీద్ కమిటీ అనుమతి లేకుండా నిర్మించబడింది. ఖబ్రస్తాన్ ప్రవేశ మార్గానికి పూర్తిగా ఎదుట ఈ సమాధిని రాత్రికి రాత్రి నిర్మించారు. ఈవిషయం మస్జీద్ కమిటీకి ఆలస్యంగా తెలిసింది. దీంతో ఆ సమాధిపై సిమెంటుతో ఎలాంటి పక్కా నిర్మాణాలు చేయకుండా నిరోధించేందుకు ఈవిధంగా ఇనుప డోర్ ను వేయించి లాక్ చేశారు. డెబ్బై ఏళ్ళ ఏజ్ లో మరణించిన వృద్ధ మహిళను ఇందులో ఖననం చేశారు. 40 రోజుల తర్వాత ఆమె కుమారుడు సమాధిపై గ్రిల్‌ను నిర్మించాడు.

Also Read:  Bhola Shankar Look: ట్యాక్సీ డ్రైవర్ గా చిరంజీవి.. వింటేజ్ లుక్స్ అదుర్స్