Site icon HashtagU Telugu

Queen Is Laid To Rest: బ్రిటన్‌ రాణికు తుది వీడ్కోలు

Coffin Imresizer

Coffin Imresizer

బ్రిటన్‌ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగిన ఎలిజబెత్‌ా2 అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. బ్రిటన్‌, యూరప్‌లోనిఇతర దేశాల నుంచి లక్షలాది మంది రాణి అంత్యక్రియల్లో ప్రత్యక్షంగా పాల్గనాురు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బ్రిటన్‌ పౌరులు ఆమెకుకనీుటితో వీడ్కోలు పలికారు. రాణి అంత్యక్రియల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోపాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2వేల మంది ప్రముఖులు పాల్గనాురు. బకింగ్‌హం ప్యాలెస్‌లో రాజు చార్లెస్‌ను కలుసుకొనిసంతాపం తెలిపారు.
అత్యంత పురాతనమైన వెస్ట్‌మినిస్టర్‌ అబే చర్చిలో ప్రార్థనల అనంతరం రెండు నిమిషాలపాటు అక్కడ హాజరైనవారు మౌనం పాటించారు. ఈ ఘట్టంతో బ్రిటన్‌ రాజుగా ఛార్లెస్‌ా3 పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించినట్టే. చర్చి వద్ద జాతీయ గీతాలాపనతో ఎలిజబెత్‌ అంత్యక్రియల ఘట్టం పూర్తయ్యింది. దీనికంటే కొద్ది నిమిషాల ముందు ప్రార్థనలు జరిగే సమయంలో అక్కడును గంటను 96సార్లు మోగించారు. రాణి ఎలిజబెత్‌ బతికివును 96ఏండ్లకుగుర్తుగా అనిుసార్లు ఈ గంటను మోగించారు. వెస్ట్‌మినిస్టర్‌ అబే చర్చిలో ప్రార్థనలు పూర్తయిన తర్వాత, విండ్సర్‌ క్యాసిల్‌లో అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి భౌతిక కాయానిు తీసుకెళ్లారు. చివరిగా..సనిుహితుల సమక్షంలో విండ్సర్‌ క్యాసిల్‌లో రాణి ఎలిజబెత్‌ను ఖననం చేశారు. గతేడాది కనుుమూసిన రాజు ఫిలిప్‌ సమాధానిపక్కనే ఎలిజబెత్‌కుఅంత్యక్రియలు నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వేలాదిమంది అతిథులు, లక్షలాది మంది బ్రిటన్‌ పౌరుల సమక్షంలో రాణి అంతిమయాత్ర అధికారిక లాంఛనాలతో సాగింది. వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లోనిక్యాటఫాక్‌పై ఉను రాణి శవపేటికను విండ్సర్‌ క్యాసిల్‌కుతీసుకెళ్లే కార్యక్రమం సోమవారం మొదలైంది. ఈక్రమంలో రాణి పార్థీవదేహానిు తొలుత వెస్ట్‌మినిస్టర్‌ అబేకుతీసుకెళ్లారు. అక్కడ దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రముఖల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నివాళులు అర్పించారు.