Site icon HashtagU Telugu

Queen Elizabeth Is No More: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఇక లేరు

Queen Dead Imresizer

Queen Dead Imresizer

అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆమె కన్ను మూశారు. దీంతో యావత్ బ్రిటన్ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. క్వీన్ ఎలిజబెత్ 2 రాణి  వయోభారంతో పాటు, కొన్నిరోజులుగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. గత అక్టోబరు నుంచి ఆమె కొంత తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారు.
నడవడం, నిల్చోవడంలో ఇబ్బంది పడ్డారు.స్కాట్‌లాండ్‌లోని బాల్మోరల్ కోటలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు.చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా రాణిగా కొనసాగుతున్నారు ఎలిజబెత్‌-II. బ్రిటన్ రాణిగా ఆమె 25 ఏళ్ళ వయసు(1952) నుంచి ఆ హోదాలో ఉన్నారు.

వారసుడు ప్రిన్స్ చార్లెస్..

బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-II సింహాసనానికి తదుపరి వారసుడు ప్రిన్స్ చార్లెస్ (73). ఎలిజబెత్‌-II మరణ వార్త తెలియడంతో ప్రిన్స్ చార్లెస్, ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం (40) స్కాట్లాండ్‌కు వెళుతున్నట్లు ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా బ్రిటన్ రాణి ఇప్పటి వరకు 15 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ జాబితాలో తాజాగా, బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ కూడా చేరారు. ఆమె దేశానికి మూడో మహిళా ప్రధాన మంత్రి కూడా.

టన్ రాణి క్వీన్ ఎలిజబెత్ -2 కన్నుమూశారు. ఆమె వయస్సు 96 సంవత్సరాలు. వేసవి విడిది కోసం క్వీన్ ఎలిజబెత్‌ స్కాట్లాండ్‌లోని బల్మొరల్ క్యాజిల్‌కి వెళ్ళారు. రెండు రోజుల క్రితమే బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ నియామక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అలసిపోయినట్టు కనిపించడంతో నిన్న జరగాల్సిన ప్రైవీ కౌన్సిల్ భేటీని రద్దుచేసుకున్నారు. రెస్ట్ తీసుకోవాలన్న వైద్యుల సూచనతో ఈ సమావేశాన్ని క్యాన్సిల్ చేశారు. ఆరోగ్యం విషమించినట్టు సమచారం రావడంతో రాయల్ ఫ్యామిలీ సభ్యులు వెంటనే స్కాట్లాండ్‌ చేరుకున్నారు. కాసేపటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. చాలా కాలంగా పలు సమస్యలతో ఆమె బాధపడుతున్నారు.

నిలబడడం, నడవడం వంటి విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు. దీనిని ఎపిసోడిక్ మొబిలిటీ ప్రాబ్లమ్స్ గా పేర్కొంటారు. దాదాపు గత అక్టోబర్ నుంచి క్వీన్ ఎలిజెబెత్ ఈ సమస్యలతో బాధపడుతున్నారు. క్వీన్ ఎలిజబెత్ 1952 నుంచి బ్రిటన్ సహా పలు ఇతర కామన్వెల్త్ దేశాలకు మహారాణిగా వ్యవహరిస్తున్నారు. ఆయా దేశాల్లో కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మొదలైన దేశాలున్నాయి. కింగ్ జార్జ్ 6 మరణం అనంతరం ఆమె మహారాణిగా బాధ్యతలు చేపట్టారు. అప్పడు ఆమె వయస్సు 25 ఏళ్లు మాత్రమే. ఈ సంవత్సరం, ఆమె ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన రెండవ చక్రవర్తి అయ్యారు. ఈ సంవత్సరం జూన్లో క్వీన్ ఎలిజబెత్ మహారాణిగా 70 సంవత్సరాలు కొనసాగిన సందర్భంగా ఉత్సవాలు జరిగాయి. రాణి తన ఆరోగ్యం కారణంగా కొన్ని కార్యక్రమాలను హజరు కాలేక పోయింది. ప్రిన్స్ చార్లెస్ , రెండవ వరుసలో ఉన్న ప్రిన్స్ విలియం వాటికి హాజరయ్యారు. ఆమె జూబ్లీ పోటీ ముగింపులో బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీలో కనిపించింది.కాగా రాణి మరణించడంతో ఆమె కుమారుడు మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్ వారసుడిగా పదవీ బాధ్యతలు చేపడతారు.

Exit mobile version