Putin – 8 Children : ఒక్కొక్కరికి 8 మంది పిల్లలు.. రష్యా మహిళలకు పుతిన్ పిలుపు

Putin - 8 Children : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ మహిళలకు సంచలన సూచనలు చేశారు.

  • Written By:
  • Updated On - December 1, 2023 / 04:33 PM IST

Putin – 8 Children : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ మహిళలకు సంచలన సూచనలు చేశారు. దేశ జనాభాను పెంచేందుకుగానూ రష్యా మహిళలు ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో జనాభాను పెంచడానికి పెద్ద కుటుంబాల ఏర్పాటును ఒక కట్టుబాటుగా మార్చుకోవాలని కోరారు. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్‌ సమావేశంలో పుతిన్ ఈవివరాలను వెల్లడించారు. దేశ జనాభాను పెంచడాన్ని రాబోయే దశాబ్దాల లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రజలను కోరారు. ఉక్రెయిన్‌తో భీకర యుద్ధం చేస్తున్న రష్యా తీవ్రంగా సైనికుల కొరతను ఎదుర్కొంటోంది.  ఇటీవల కాలంలో దేశంలో జననాల రేటు తగ్గిపోయింది. మరణాల రేటు పెరిగింది. ఈనేపథ్యంలో రష్యా జనాభాను పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో సైనికుల కొరతను అధిగమించాలని పుతిన్ ప్లాన్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘మా అమ్మమ్మలు, నానమ్మలు ఒక్కొక్కరికి ఏడు నుంచి ఎనిమిది మంది పిల్లలు ఉండేవారు.  అదే సంప్రదాయాన్ని మనం కొనసాగిద్దాం. దాన్ని పునరుజ్జీవింపజేద్దాం. కుటుంబం అనేది దేశానికి, సమాజానికి పునాది మాత్రమే కాదు.. అది ఒక ఆధ్యాత్మిక దృగ్విషయం, నైతికతకు మూలం’’ అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పెద్దసంఖ్యలో సైనికులను కోల్పోయింది.దీంతో  సైనికుల రిక్రూట్మెంట్ కోసం పుతిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అయినా అప్లికేషన్లు పెద్దగా రాలేదు. కాగా, రష్యా జనాభా 14.34 కోట్లు మాత్రమే. అమెరికా జనాభా 30 కోట్లకుపైనే ఉంటుంది. అణ్వాయుధాలు, యుద్ధ విమానాలు, మిస్సైళ్లు ఉన్నప్పటికీ..  జనాభా కొరత అనేది రష్యాకు పెద్ద మైనస్ పాయింట్‌గా(Putin – 8 Children) మారింది.

Also Read: Guntur Kaaram: “గుంటూరు కారం” మూవీకి మిగిలింది 40 రోజులే.. ఇలా అయితే కష్టమే!