New Nuclear Weapons : న్యూక్లియర్ క్షిపణి ‘బ్యూరేవెస్ట్నిక్’ రెడీ : పుతిన్

New Nuclear Weapons : అణు సామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి ‘బ్యూరేవెస్ట్నిక్‌’ (Burevestnik)ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.

  • Written By:
  • Updated On - October 6, 2023 / 08:24 AM IST

New Nuclear Weapons : అణు సామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి ‘బ్యూరేవెస్ట్నిక్‌’ (Burevestnik)ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రష్యా తన కొత్త తరం అణ్వాయుధాలలో కీలకమైన ‘సర్మత్’ (Sarmat) ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ డెవలప్మెంట్ కు సంబంధించిన పనిని దాదాపు పూర్తి చేసిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. 1990 సంవత్సరంలో సోవియట్ యూనియన్ పతనానికి ముందు రష్యా అణు విస్ఫోటనంతో కూడిన అణు పరీక్షను నిర్వహించింది. ఆ తర్వాత ఎన్నడూ అలాంటి అణుపరీక్షలు నిర్వహించలేదు.

We’re now on WhatsApp. Click to Join

మళ్లీ ఆ విధమైన అణు పరీక్షలు చేస్తారా అని విలేకరులు పుతిన్ ను ప్రశ్నించగా.. వాటిని చేయబోమని రష్యా ప్రెసిడెంట్ స్పష్టం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో మళ్లీ రష్యా ఆ దిశగా అడుగులు వేయొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈసందర్భంగా పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ‘‘ అణు పరీక్షలను నిషేధించే ఒప్పందాన్ని అమెరికా ఆమోదించలేదు. కానీ రష్యా సంతకం చేసి దానికి అంగీకారం తెలిపింది. రష్యా పార్లమెంటు ‘డ్యూమా’ తన ఆమోదాన్ని ఉపసంహరించుకోవడం సాధ్యమయ్యే విషయమే’’ అని పేర్కొనడం గమనార్హం. అణుపరీక్షల నిషేధ ఒప్పందం నుంచి బయటికి రావాలని రష్యా భావిస్తోందనే సంకేతాలను పుతిన్ (New Nuclear Weapons) తన కామెంట్స్ ద్వారా అంతర్జాతీయ సమాజానికి పంపారు.

Also read : Russian Rocket Strike: ఉక్రెయిన్‌పై మరోసారి దాడి చేసిన రష్యా.. 51 మంది స్పాట్ డెడ్