Site icon HashtagU Telugu

martial law: ఆ నాలుగు ప్రాంతాలలో రష్యా మార్షల్ లా..!

Putin Agrees To China Visit

Putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలలో మార్షల్ లా ప్రవేశపెట్టే చట్టంపై సంతకం చేశారు. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించి ఉక్రెయిన్‌కు ఆనుకుని ఉన్న ఎనిమిది రష్యన్ ప్రాంతాలలో వెలుపలికి వెళ్లడంపై పరిమితులను విధించే ప్రత్యేక ఉత్తర్వుతో పాటు విలీనం చేసినట్లు పేర్కొన్నాడు. అయితే.. రష్యా ఇటీవల విలీనం చేసుకున్న ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో మార్షల్‌ లా విధించింది.

బుధవారం జరిగిన జాతీయ భద్రతా మండలి సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించింది. లుహాన్స్క్, దొనేత్సక్, జపోరిజ్జియా, ఖెర్సన్‌లో మార్షల్‌ లా గురువారం ఉదయం నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. ఉక్రెయిన్‌లో పోరాటాన్ని పెంచేందుకు ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం కోసం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. రష్యా భద్రతా మండలి సమావేశంలో తాను ఈ విధానాన్ని విధిస్తానని పుతిన్ చెప్పారు. ఆ నాలుగు ప్రాంతాల్లో గురువారం నుంచి మార్షల్ లా అమలులోకి వస్తుందని ఆయన స్పష్టం చేసారు.

మరోవైపు రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విద్యుత్‌, నీటిసరఫరా వ్యవస్థలే లక్ష్యంగా రష్యన్‌ సైన్యం దాడులకు పాల్పడుతోందని, ఉక్రెయిన్‌ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ద్వారా దేశంపై ఆధిపత్యం చెలాయించేందుకు పుతిన్‌ కుటిలయత్నాలు చేస్తున్నారని జెలెన్‌స్కీ విమర్శించారు. ఉక్రెయిన్‌ ప్రజల్ని చీకటిలోకి నెట్టేస్తే శాంతి చర్చలు జరుగుతాయనుకోవడం అసంభవం అని చెప్పారు. పుతిన్‌ అధికారంలో ఉండగా రష్యాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని జెలెన్‌స్కీ తెలిపారు.