Site icon HashtagU Telugu

Alexei Navalny : జైలులో పుతిన్ రాజకీయ ప్రత్యర్ధి నావల్నీ మృతి.. ఏం జరిగింది ?

Navalny

Navalny

Alexei Navalny :  రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ రాజకీయ ప్రత్యర్ధి 47 ఏళ్ల అలెక్సీ నావల్నీ ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. రష్యా బార్డర్‌లోని ఉత్తర సైబీరియా ప్రాంతంలో ఉన్న ఆర్కిటిక్ జైలు ప్రాంగణంలో ఇవాళ మార్నింగ్ వాక్‌కు వెళ్లిన నావల్నీ స్పృహ కోల్పోయారు. దీన్ని గమనించిన జైలు సిబ్బంది హుటాహుటిన ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నావల్నీ చనిపోయారని ఆస్పత్రిలోని డాక్టర్లు వెల్లడించారు. నావల్నీ మరణానికి గల కారణాలను గుర్తించడంపై ఇన్వెస్టిగేటివ్ పోలీసులు ఫోకస్ పెట్టారు.

We’re now on WhatsApp. Click to Join

రష్యాలోని పుతిన్ సర్కారు ఎన్నో కేసులను నావల్నీపై బనాయించింది. దేశానికి వ్యతిరేకంగా నావల్నీ కుట్రలు చేస్తున్నారనే అభియోగాలను ఆయనపై మోపింది. ఈ కేసుల్లో నావల్నీకి గతంలో 19 ఏళ్ల జైలు శిక్షపడింది. దీంతో ఆయన కొన్నేళ్ల పాటు రష్యా నుంచి వెళ్లిపోయి వివిధ దేశాల్లో ప్రవాసంలో గడిపారు. అక్కడే ఉంటూ పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్స్, టెలిగ్రామ్ ఛానల్స్, సోషల్ మీడియా వేదికల ద్వారా విమర్శలు చేశారు. పుతిన్ సర్కారు అవినీతికి సంబంధించిన ఎన్నో వివరాలను వెలుగులోకి తెచ్చారు.

Also Read :Facial Razor Using Tips: అమ్మాయిలు ఫేస్ షేవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే గాయాలు తప్పవు?

ఈనేపథ్యంలో 2021 సంవత్సరంలో నావల్నీ జర్మనీ నుంచి రష్యాకు తిరిగొచ్చిన వెంటనే పుతిన్ అరెస్టు చేయించి జైల్లో పెట్టించారు. జైలులో ఉండగా నొవిచోక్ అనే ప్రమాదకర విషాన్ని నావల్నీపై ప్రయోగించగా.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనేపథ్యంలో గతేడాది నావల్నీని ఆర్కిటిక్ ప్రాంతంలోని ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీకి తరలించారు. దీనికి రష్యా దేశంలోనే అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేసే జైలుగా పేరుంది. ఈ జైలుకు పంపించి కనీసం ఏడాదైనా గడవకముందే అలెక్సీ నావల్నీ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

Also Read :  Bandi Sanjay : 8మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, 5గురు సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు