Unstoppable Missile : పుతిన్ బ్రహ్మాస్త్రం ‘శాటన్- 2’.. ఈవారంలోనే టెస్ట్ ?

Unstoppable Missile : ప్రపంచంలోనే అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణి  ‘శాటన్- 2’ను ఈనెలాఖరులోగా రష్యా టెస్ట్ చేయబోతోంది.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 07:54 AM IST

Unstoppable Missile : ప్రపంచంలోనే అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణి  ‘శాటన్- 2’ను ఈనెలాఖరులోగా రష్యా టెస్ట్ చేయబోతోంది. రష్యా దక్షిణ ధ్రువ ప్రాంతంలో దీన్ని టెస్ట్ చేయబోతున్నారు. సైబీరియాలోని క్రాస్నోయార్స్క్ ప్రాంతంలో శాటన్-2 మిస్సైల్ టెస్ట్ జరుగుతుందని అంటున్నారు. ఈ మిస్సైల్ ఎంత పవర్ ఫుల్ అంటే..  గంటకు 15,880 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.

Also Read: IND vs AUS Head to Head: ఆసీస్ తో టీ ట్వంటీ సిరీస్.. హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే ?

ఈ భారీ క్షిపణి బరువు 208 టన్నులు. 14 అంతస్తుల టవర్ బ్లాక్ అంత పెద్ద సైజులో ఉంటుంది. ఇది న్యూక్లియర్ వార్ హెడ్లను కూడా మోసుకెళ్లగలదు. ‘శాటన్- 2’ను ఏ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఆపలేదు. రష్యా బార్డర్‌లోని ఫిన్లాండ్‌లో నాటో కూటమి సేనలను అమెరికా మోహరించిన నేపథ్యంలో ‘శాటన్- 2’ను టెస్ట్ చేయాలని రష్యా ఆర్మీకి అధ్యక్షుడు పుతిన్ ఆర్డర్ ఇచ్చారు. ‘శాటన్- 2’ మిస్సైల్స్‌తో మొదటి రెజిమెంట్‌ను డిసెంబరుకల్లా రెడీ చేయాలని ఆయన ఆదేశించారు.

We’re now on WhatsApp. Click to Join.

శాటన్ -2 మిస్సైల్‌ను పుతిన్ 2018లో ఆవిష్కరించారు. 2022 ఏప్రిల్‌లోనూ ఈ క్షిపణిని ఒకసారి టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్షిపణి వల్ల ప్రధానంగా నాటో కూటమిలోని  దేశాలకు భయం పట్టుకుంది. ఉక్రెయిన్‌కు మద్దతుగా బరిలోకి దిగితే.. ‘శాటన్- 2’ మిస్సైల్స్‌‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలనే సంకేతాలను ఇచ్చేందుకే పుతిన్ తాజా నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు(Unstoppable Missile) అంటున్నారు.