పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మహిళతో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) చేసిన శృంగార సంభాషణకు సంబంధించిన ఆడియో లీక్ అయింది. ఇమ్రాన్ తన పదవి కోల్పోయిన తర్వాత ఓ మహిళతో ఇలా మాట్లాడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇవన్నీ నకిలీవని, ప్రభుత్వం సృష్టించి కావాలనే విడుదల చేసిందని ఇమ్రాన్ పార్టీ ఆరోపించింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇద్దరు మహిళలతో ‘సెక్స్ కాల్’ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాకిస్థాన్‌లో కలకలం రేగింది. ఈ క్లిప్ వైరల్ కావడంతో ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. కొందరు వారి ఇస్లామిక్ విలువలను ప్రశ్నిస్తున్నారు. కొందరు ఈ క్లిప్ ఇమ్రాన్ ఖాన్‌ను ఇరికించే కుట్ర అని పేర్కొన్నారు.
Also Read: King Charles: కరెన్సీ నోట్లపై కింగ్ చార్లెస్ ఫొటో.. అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ప్రకటన వెలువడింది. ఈ క్లిప్ పూర్తిగా నకిలీదని, యాప్‌ని ఉపయోగించి ఎవరి వాయిస్‌నైనా మార్చవచ్చని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఆడియో క్లిప్‌ను పాకిస్థానీ జర్నలిస్ట్ సయ్యద్ అలీ హైదర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకున్నారు. క్లిప్ ఇప్పటికీ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. వైరల్ లీకైన క్లిప్‌లో ఇమ్రాన్ ఒక మహిళతో అసభ్యకరమైన సంభాషణను వినవచ్చు. ఆడియోలో ఇమ్రాన్ ఖాన్ సన్నిహితంగా మాట్లాడుతున్న మహిళ ఆయన సొంత పార్టీ పిటిఐకి చెందిన మంత్రి. ఈ ఆడియో పాతదే అంటున్నారు.