Princess Diana: ఈవారంలోనే డయానా వస్తువుల వేలం.. ఐటమ్స్ వివరాలివీ

దివంగత బ్రిటీష్ యువరాణి డయానాకు చెందిన గౌన్లు, షూలు, హ్యాండ్ బ్యాగ్‌లు, టోపీలు సహా 50 రకాల వస్తువులను ఈవారం వేలం వేయనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Princess Dianas Gowns Auction

Princess Diana: దివంగత బ్రిటీష్ యువరాణి డయానాకు చెందిన గౌన్లు, షూలు, హ్యాండ్ బ్యాగ్‌లు, టోపీలు సహా 50 రకాల వస్తువులను ఈవారం వేలం వేయనున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న బెవర్లీ హిల్స్‌లో వీటి వేలంపాట జరగనుంది. అమెరికాకు చెందిన ‘జూలియెన్స్ ఆక్షన్స్’ సంస్థ ఈ వేలంపాటను నిర్వహిస్తోంది. 1986 సంవత్సరంలో ‘ది ఫాంటమ్ ఆఫ్ ది ఒపెరా’ మ్యూజిక్ ఆల్బమ్ ప్రీమియర్ షోకు అప్పట్లో డయానా(Princess Diana) హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆమె ధరించి వెళ్లిన బ్లూ డైమంట్ బాల్ గౌను ఇప్పుడు వేలం వేయనున్నారు.  దివంగత  బ్రిటన్ ఫ్యాషన్ డిజైనర్ విక్టర్ ఎడెల్‌స్టీన్ తయారు చేసిన మెజంతా లేస్ డ్రెస్సు కూడా వేలం పాట దుస్తుల జాబితాలో ఉంది. ఈ రెండు దుస్తులను వేలం వేయడం ద్వారా తమకు దాదాపు రూ.3.50 కోట్లు వస్తాయని ‘జూలియెన్స్ ఆక్షన్స్’ సంస్థ అంచనా వేస్తోంది. కాగా, గత ఏడాది డయానాకు చెందిన కొన్ని డ్రెస్సులను అమెరికాలో  వేలం వేయగా దాదాపు రూ.9.50 కోట్లు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join

డయానా జీవితం విశేషాలు..

  • డయానా 1981లో ఇప్పటి బ్రిటన్ రాజు ఛార్లెస్‌ను పెళ్లి చేసుకున్నారు.
  • ఈ వేడుకను అప్పట్లో టీవీల్లో పది లక్షల మంది వీక్షించారు.
  • డయానా, కింగ్ ఛార్లెస్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు.. ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ.
  • 1996 ఆగస్టు 28న కుటుంబ కలహాలతో డయానా, కింగ్ ఛార్లెస్ విడాకులు తీసుకున్నారు.
  • 1997 ఆగస్టు 31న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జరిగిన కారు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో  డయానా చనిపోయారు.

Also Read :Car – Vastu : వాహనాల పార్కింగ్.. వాస్తు టిప్స్ ఇవిగో

  Last Updated: 26 Jun 2024, 09:44 AM IST