ఇజ్రాయోల్ లో మరోసారి బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఐదోసారి ఇజ్రాయెల్ ప్రధానికిగా బాధ్యతలు స్వీకరించనున్నారు బెంజమిన్ నెతన్యాహూ. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 73ఏళ్ల నాయకుడు 2021లో మితవాద, ఉదారవాద, అరబ్ పార్టీల సంకీరణ కూటమి చేతిలో బెంజమిన్ నెతన్యాహు ఓడిపోయారు. ఏడాది తర్వాత తిరిగి మళ్లీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు బెంజమిన్.
బెంజమిన్ కు మోదీ ఇలా ట్వీట్ చేశారు. మజల్ తోవ్ నా స్నేహితుడు నెతన్యాహు. మీ ఎన్నికల విజయం భారత, ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతుందని..ఉమ్మడి ప్రయత్నాలు తిగిగి కొనసాగిస్తుందని ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. కాగా ఇజ్రాయోల్ ప్రస్తుత ప్రధాని యైర్ లాపిడ్ తన ఓటమిని అంగీకరించారు. నెతన్యాహూ కూటమికి 120 సీట్లలో 60 సీట్లు వస్తాయని చెబుతున్నారు. లాపిడ్ నెతన్యాహుకు ఫోన్ చేసి విజయంపై అభినందనలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ రిపోర్టు పేర్కొంది.
కాగా బెంజమిన్ నెతన్యాహు అధికారంలోకి వస్తే భారత్ ఇజ్రాయోల్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ఏ ఏడాది జనవరిలో భారత్ ఇజ్రాయోల్ 30ఏళ్ల పూర్తి దౌత్య సంబంధాలను పూర్తి చేసుకున్నాయి. భారత్ లో బలమైన దైపాక్షిక సంబంధాలను సమర్ధించు నెతన్యాహు 2018లో భారత్ ను సందర్శించారు. అంతకంటే ముందు 2017లో మోదీ ఇజ్రాయోల్ లో పర్యటించారు. ఒక భారత ప్రధాని ఇజ్రాయెల్లో పర్యటించడం అదే తొలిసారి.