Site icon HashtagU Telugu

Gaza Ground Attack : గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్.. బైడెన్ గ్రీన్ సిగ్నల్

Biden Visits

Joe Biden

Gaza Ground Attack : గాజాపై గ్రౌండ్ ఎటాక్‌ చేసేందుకు రెడీ అవుతున్న ఇజ్రాయెల్ కు  అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ .. ‘‘గాజాపై గ్రౌండ్ ఎటాక్ చేేసే విషయంలో ఇజ్రాయెల్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అది దాని ఆత్మరక్షణకు సంబంధించిన అంశం’’ అని స్పష్టం చేశారు. తమ మిత్రపక్షమైన ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. మంగళవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి ఫోటో దిగుతుండగా.. ‘‘గాజాపై గ్రౌండ్ ఎటాక్ ను ఆపాలని మీరు ఇజ్రాయెల్ కు సూచిస్తున్నారా?’’ అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బైడెన్ పైవిధంగా సమాధానం (Gaza Ground Attack) ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

గాజాపై గ్రౌండ్ ఎటాక్ విషయంలో గతవారమే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గ్యాలంట్ తమ ప్రణాళికను ప్రకటించారు. మూడు దశల దాడి ద్వారా గాజా నుంచి హమాస్ ను తరిమేస్తామని వెల్లడించారు. మొదటి దశ వైమానిక దాడులు.. రెండో దశ భూతల దాడి.. మూడోదశ హమాస్ స్థావరాల విధ్వంసం అని ఆయన వివరించారు. మరోవైపు అమెరికా జాతీయ భద్రతా మండలిలోని వ్యూహాత్మక కమ్యూనికేషన్‌ల సమన్వయకర్త జాన్ కిర్బీ మాట్లాడుతూ..‘‘ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన సాధనాలు, సామర్థ్యాలను అమెరికా అందిస్తుంది’’ అని ప్రకటించారు. ఒకవేళ ఇప్పుడు కాల్పుల విరమణను ప్రకటిస్తే.. హమాస్‌కు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రాణ నష్టం తగ్గించేలా యుద్ధం కొనసాగించాలని మేం ఇజ్రాయెల్ ను కోరుతున్నామని జాన్ కిర్బీ పేర్కొన్నారు.

Also Read: TDP : నేటి నుంచి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం.. చిత్తూరు జిల్లాలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌