Site icon HashtagU Telugu

Joe Biden: గాజాలో మానవతా సాయానికి అమెరికా ప్రెసిడెంట్ ఆమోదం

President Biden Says Us Is

President Biden Says Us Is

 

 

Joe Biden: ఉగ్రవాద సంస్థ హమాస్‌(Hamas)ను అంతమొందించడానికి గాజా(Gaza)లో ఇజ్రాయెల్(Israel) కొనసాగిస్తున్న యుద్ధకాండతో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు(Palestinians) నిరాశ్రయులుగా మారుతున్నారు. ఆహారం సహా కనీస వసతులు లేక విలవిల్లాడుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గాజాలో మానవతా సాయం(Humanitarian aid) అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలిపారు. ఇజ్రాయెల్ బలగాల కాల్పుల్లో ఏకంగా 100 మందికి పైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడిన మరోసటి రోజే ఈ ప్రకటన వెలువడింది.

We’re now on WhatsApp. Click to Join.

త్వరలోనే సహాయక చర్యలు ప్రారంభం కానున్నాయి. అమెరికా మిలిటరీ(US military)వాయుమార్గాన ఆహారం సహా ఇతర పదార్థాలను జారవిడచనున్నారు. పాలస్తీనియన్ల వెతలు తగ్గించడమే లక్ష్యంగా యుద్ధంలో దెబ్బతిన్న భూభాగాల్లో అవసరమైన సాయాన్ని అందజేస్తామని అధ్యక్షుడో జో బైడెన్ తెలిపారు. సాయం అందించేందుకు అదనపు మార్గాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. సముద్రమార్గాన సాయం అందించడంపై కూడా దృష్టిసారించినట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జోర్డాన్‌లోని మిత్రపక్షాలతో కలిసి అదనపు ఆహారం, సామగ్రిని ఎయిర్‌డ్రాప్‌ చేయనున్నట్టు వివరించారు.

read also : Bollywood Ramayan : బాలీవుడ్ రామాయణం ముహూర్తం ఫిక్స్..!

కాగా, రెండు రోజులక్రితం సాయం అందించేందుకు వచ్చిన కాన్వాయ్ నుంచి వస్తువులను లాగేందుకు జనాలు ఎగబడడంతో పాలస్తీనియన్ ప్రజలపై ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరపడంతో ఈ దారుణం జరిగిందని సాక్షులు చెబుతున్నారు. కనీసం 115 మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారని, 750 మందికి పైగా గాయపడ్డారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.