వెనిజులాలో అధికార మార్పిడి.. నికోలస్ మదురో కుమారుడి సంచలన వ్యాఖ్యలు!

నికోలస్ మదురో అరెస్టు తర్వాత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె మదురోకు అత్యంత నమ్మకస్తురాలిగా పేరుగాంచారు.

Published By: HashtagU Telugu Desk
Nicolas Maduros Son

Nicolas Maduros Son

Venezuela: వెనిజులాలో ప్రభుత్వం పడిపోయిన తర్వాత పదవిని కోల్పోయిన అధ్యక్షుడు నికోలస్ మదురో కుమారుడు నికోలస్ మదురో గుెరా తొలిసారి స్పందించారు. కొంతమంది వెనిజులాకు ద్రోహం చేశారని, రాబోయే రోజుల్లో ఆ ముఖాలను బయటపెడతామని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక ఆడియో రికార్డింగ్‌లో ఆయన మాట్లాడుతూ “ద్రోహి ఎవరో చరిత్రే చెబుతుంది, చరిత్రే దీనిని బహిర్గతం చేస్తుంది” అని పేర్కొన్నారు.

గౌరవ జెండాలను ఎగురవేస్తాం: గుెరా

“వారు మమ్మల్ని బలహీనంగా చూడాలనుకుంటున్నారు. మేము గౌరవం, ఆత్మగౌరవ జెండాలను ఎగురవేస్తాం. ఈ పరిస్థితి మాకు బాధ కలిగిస్తోందా? ఖచ్చితంగా బాధ కలిగిస్తోంది. మాకు కోపం వస్తోంది. కానీ వారు మమ్మల్ని ఏమీ చేయలేరు. నా తల్లి సిలియాపై ఒట్టు వేసి చెబుతున్నాను. వారు విజయం సాధించలేరు” అని గుెరా అన్నారు. జనవరి 4-5 తేదీల్లో జరిగే బహిరంగ ఉద్యమాల్లో పాల్గొని ఐక్యతను చాటాలని ఆయన తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

Also Read: సినిమా చూసేందుకు ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్లిన రేవంత్ & టీం , ఇంతకీ ఏ సినిమానో తెలుసా ?

డ్రగ్ నెట్‌వర్క్ సూత్రధారి అని అమెరికా ఆరోపణ

మదురో గుెరా వెనిజులా పాలక పక్షమైన యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ (PSUV) సభ్యుడు. వెనిజులా నుండి అమెరికాకు మాదకద్రవ్యాలను సరఫరా చేయడానికి ప్రభుత్వ ఆస్తులు, మిలిటరీ, రాజకీయ పలుకుబడిని ఉపయోగించిన భారీ డ్రగ్ నెట్‌వర్క్‌కు గుెరా ప్రధాన సూత్రధారి అని అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

ప్రస్తుతం నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ అమెరికాలో నిర్బంధంలో ఉన్నారు. నార్కో-టెర్రరిజం, డ్రగ్స్ స్మగ్లింగ్ కుట్ర ఆరోపణలపై వారిని సోమవారం (జనవరి 5) న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నారు.

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్

నికోలస్ మదురో అరెస్టు తర్వాత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె మదురోకు అత్యంత నమ్మకస్తురాలిగా పేరుగాంచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెను అధ్యక్షురాలిగా గుర్తించే విషయంపై మాట్లాడారు. డెల్సీ రోడ్రిగ్జ్‌పై ఇప్పటికే అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు ఉన్నాయి. ఆమె మదురో ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా వ్యవహరించారు.

  Last Updated: 05 Jan 2026, 09:00 PM IST