చికెన్ గున్యా ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఏటాకు కొన్ని లక్షల మంది ఈ చికెన్ గున్యా బారిన పడుతూ ఉంటారు. ఇప్పటికే చాలామంది ఈ చికెన్ గున్యా బారిన పడి మరణించిన విషయం తెలిసిందే. దోమ కాటు వల్ల వచ్చే ఈ వైరస్ మానవుడిలోకి ప్రవేశిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి వచ్చినప్పుడు జ్వరం కాళ్లు కీళ్ల నొప్పులు లాంటి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా విపరీతమైన ఒళ్ళు కీళ్ల నొప్పులు ఉంటాయి. అయితే ఈ జ్వరానికి సంబంధించి లక్షణాలను వ్యతిరేకంగా ట్రీట్మెంట్ చేసే విధానం మాత్రమే అందుబాటులో ఉంది.
కొన్ని రోజుల్లో మానవ శరీరం వైరస్ కు వ్యతిరేకంగా యాంటీ బాడీలను తయారు చేసుకొని వ్యాధిని నిర్మూలిస్తుంది. కొన్నిసార్లు ఈ వ్యాధి ప్రాణాంతకంగా కూడా మారుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ వ్యాధి విషయంలో ఒక గుడ్ న్యూస్ ని తెలిపారు పరిశోధకులు. చికెన్ గున్యా కు వ్యతిరేకంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ సానుకూల ఫలితాలను చూపించినట్లు తెలిపారు. ఫ్రెంచ్ ఆస్ట్రియన్ డ్రగ్ మేకర్ వాల్నేవా ఈ వ్యాక్సిన్ తయారు చేస్తోంది. ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్ మంచివి ఫలితాలను చూపించినట్లు వాడు వెల్లడించారు.
VLA1553 అని పిలవబడే ఈ వ్యాక్సిన్ ను అమెరికా కెనడాలో ఆమోదం కోసం దరఖాస్తు చేసుకుంది. ప్లాసిబో కంట్రోల్ ఫేస్ మూడోదశ ట్రయల్స్ లో బలహీనపరిచిన వైరస్ ని వ్యాక్సిన్ గా అందించి అది ఎంత మేర మానవ రోగనిరోధక వ్యవస్థ మేలుకునేలా చేస్తుంది అన్న విషయం పై ఫలితాలను రాబట్టారు. కొందరు వ్యక్తులపై ఈ టీకాలను ప్రయోగించారు. ట్రైల్స్ లో భాగంగా 4100 మందిపై ఈ టీకాను ప్రయోగించగా సింగిల్ షాట్ వ్యాక్సిన్ ఇతర టీకాలు మాదిరిగానే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లతో సురక్షితమైనదిగా తేలింది. వారిలో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే తీవ్రమైన సైడ్ ఎఫెక్టులకు గురయ్యారు. ఆ తర్వాత వారు కూడా కోలుకున్నట్లు స్టడీ వెల్లడించింది. త్వరలోనే ఈ వ్యాక్సిన్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.