PM Modi: మోదీకి ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ ఘన స్వాగతం

ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా జూలై 13 (గురువారం) ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. ప్యారిస్‌లోని ఓర్లీ విమానాశ్రయంలో ప్రధాని ల్యాండ్ అయ్యారు

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా జూలై 13 (గురువారం) ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. ప్యారిస్‌లోని ఓర్లీ విమానాశ్రయంలో ప్రధాని ల్యాండ్ అయ్యారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు. అదే సమయంలో ప్రధాని మోదీ గౌరవార్థం ఫ్రెంచ్ సైన్యం ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చింది. ఈ సమయంలో ఫ్రెంచ్ సైన్యం మొదట భారత జాతీయ గీతాన్ని ప్లే చేసింది. అనంతరం ఫ్రాన్స్ జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఫ్రాన్స్‌ తో సత్సంబంధాలు కొనసాగించేందుకు చర్చిస్తానని పర్యటనకు ముందు మోడీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పారిస్ పర్యటనలో రక్షణ, అంతరిక్షం సహా వివిధ రంగాల్లో భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తారు. జూలై 14న పారిస్‌లో జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవానికి గౌరవ అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి ప్రధాని మోదీ పాల్గొంటారు. పరేడ్ అనంతరం ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చే లంచ్‌లో ప్రధాని పాల్గొంటారు. అనంతరం ఫ్రాన్స్ కంపెనీల సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.

ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ జూలై 15 న యుఎఇలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అతను UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో చర్చలు జరుపుతారు. ఇంధనం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించేందుకు ఈ పర్యటన సాగనుంది.

Read More: Suicide: కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి 20 ఏళ్ళ యువతి ఆత్మహత్య