PM Modi: ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫాలోవర్లు 100 మిలియన్లకు చేరారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లున్న నేతగా నిలిచారు ప్రధాని మోడీ. డొనాల్డ్ ట్రంప్‌తో సహా పలువురు నేతలను వెనక్కి నెట్టారు. బరాక్ ఒబామా తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అనుసరించే రాజకీయ నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. 2020లో డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో ఫాలోవర్ల విషయంలో ప్రధాని మోదీ కంటే చాలా ముందున్నారు. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ప్రధాని మోదీ ముందున్నారు. అంచనా ప్రకారం మోడీని ప్రతిరోజూ సగటున 19,711 మంది కొత్తగా ఫాలో అవుతున్నారు.
ఈ జాబితాలో ఎలోన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడిని 185 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. 131 కోట్ల మంది ఫాలో అవుతున్న బరాక్ ఒబామా రెండో స్థానంలో ఉన్నారు. ప్రధాని మోదీకి ఫాలోవర్లు పెరగడంతో గత ఏడాది డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్‌లను కూడా వెనక్కి నెట్టారు. .’సోషల్ బ్లేడ్’ అనే వెబ్‌సైట్ ప్రకారం.. ప్రధాని మోదీకి ప్రతిరోజూ సగటున 19,711 మంది కొత్త ఫాలోవర్లు వస్తున్నారు. అతను ట్విట్టర్‌లో 2,667 మందిని అనుసరిస్తాడు, ఇందులో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు మరియు వ్యాపార సంస్థలు ఉన్నాయి.
https://x.com/narendramodi?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (38.1 మిలియన్ల ఫాలోవర్స్), దుబాయ్ ప్రధాని షేక్ మహ్మద్ (11.2 మిలియన్ ఫాలోవర్లు), పోప్ ఫ్రాన్సిస్ (18.5 మిలియన్ ఫాలోవర్లు) వంటి ప్రపంచ నాయకుల కంటే కూడా ప్రధాని మోదీ చాలా ముందున్నారు. ఈ టాప్-10 జాబితాలో ఎలోన్ మస్క్, బరాక్ ఒబామా, జస్టిన్ బీబర్, క్రిస్టియానో రొనాల్డో, రిహన్న, కాటి పెర్రీ, టేలర్ స్విఫ్ట్, లేడీ గాగా పేర్లు ఉన్నాయి.