Iran Helicopter Crash: తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇబ్రహీం రైసీ ఆదివారం అజర్‌బైజాన్‌లో ఒక డ్యామ్‌ను ప్రారంభించేందుకు అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి వెళ్తున్నారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఆటంకం ఏర్పడింది. అటవీ ప్రాంతం మరియు వీదురు గాలులతో పాటు భారీ వర్షం పడుతుండటంతో ఆందోళనగా మారింది. ఆయన క్షేమం కోసం దేశవ్యాప్తంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టారు.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మరియు అతని క్షేమం కోసం ప్రార్థించారు. ఈ సంక్షోభ సమయంలో ఇరాన్ ప్రజలకు మేము సంఘీభావంగా ఉంటాము. అధ్యక్షుడు మరియు అతని బృందం క్షేమం కోసం మేము ప్రార్థిస్తున్నామని మోడీ ఎక్స్ వేదికగా స్పందించాడు.
ప్రెసిడెంట్ రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దుల్లాహియాన్ మరియు పలువురు సీనియర్ నాయకులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా ఆదివారం దేశంలోని తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో కూలిపోయినట్లు నివేదికలు తెలిపాయి. ఇరాన్ మీడియా ప్రకారం ఉత్తర ఇరాన్‌లో దట్టమైన పొగమంచు కారణంగా కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న మూడు హెలికాప్టర్‌లలో ఒకటి కష్టంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
Also Read: Lok Sabha Elections 2024: రసవత్తరంగా ఐదో దశ పోలింగ్.. బరిలో ఉన్న సీనియర్లు