Site icon HashtagU Telugu

G7 summit: జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ

G7 summit

New Web Story Copy 2023 05 20t165825.692

G7 summit: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది దాటినా దానికి ఫుల్ స్టాప్ పడట్లేదు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల్ని ఖండిస్తూ రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. కానీ భారతదేశం రష్యాతో స్నేహసంబంధం కొనసాగిస్తుంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ పలుమార్లు ఇరు దేశాల అధ్యక్షులతో సంప్రదింపులు జరిపినప్పటికీ ప్రయోజనం లేదు. రష్యా ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా జపాన్ లో GT సమ్మిట్ కొనసాగుతుంది. ఈ సమిట్ కు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. పలు విషయాలపై మోడీ వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడారు.

జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలిశారు. గతేడాది ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ఇరువురు నేతల మధ్య వ్యక్తిగతంగా భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి.

 

ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం మొత్తం ప్రపంచానికి పెద్ద సమస్యగా మారిందన్నారు. ఈ యుద్ధం ప్రపంచం మొత్తం మీద కూడా అనేక ప్రభావాలను చూపింది. నేను దీనిని రాజకీయ సమస్యగా పరిగణించను, నాకు ఇది మానవత్వానికి సంబంధించిన సమస్యగా పేర్కొన్నారు ప్రధాని. కాగా భారతదేశం తరుపున అలాగే నా వ్యక్తిగతంగా దీనిని పరిష్కరించడానికి చేయగలిగినదంతా చేస్తాను అంటూ ప్రధాని ఈ సందర్భంగా ప్రసంగించారు.

Read More: BRS Lucky : కేసీఆర్ కు వ‌రంగా రూ. 2వేల నోట్ ర‌ద్దు