Site icon HashtagU Telugu

PM Modi : థాయ్‌లాండ్ నూతన ప్రధానికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు

PM Modi congratulates the new Prime Minister of Thailand

PM Modi congratulates the new Prime Minister of Thailand

Thailand new prime minister: థాయ్‌లాండ్‌ కొత్త ప్రధానిగా ఆదేశ మాజీ ప్రధాని థాక్సిన్ కుమార్తె  పెటోంగ్‌టార్న్ షినవత్రా ఎన్నికయ్యారు. థాయ్‌లాండ్ పార్లమెంట్‌ ఆమెను ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. 37 ఏళ్ల వయస్సులో ప్రధాని అయిన ఆమె.. దేశంలో ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం థాయ్‌ నూతన ప్రధానికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. షినవత్రా విజయవంతంగా తన పదవీకాలం నిర్వహించాలని ఆకాంక్షించారు. భారత్‌, థాయ్‌లాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, తమతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, పెటోంగ్‌టార్న్ షినవత్రా కంటే ముందు ఆమె అత్త యింగ్లక్ కూడా థాయ్‌లాండ్‌ ప్రధానిగా పనిచేశారు. ఆమె తర్వాత థాయ్‌లాండ్‌ ప్రధాని పదవి చేపట్టిన రెండో మహిళ పెటోంగ్‌టార్న్ కావడం గమనార్హం. థాయ్‌లాండ్‌ ప్రధాని శ్రేతా తవిసిన్‌ను ఇటీవల రాజ్యాంగ న్యాయస్థానం తొలగించింది. ఆ తర్వాత రెండు రోజులకు షినవత్రా ప్రధానిగా ఎంపికైంది. ఇద్దరూ ఫ్యూ థాయ్ పార్టీకి చెందినవారు.

ప్రధానమంత్రి పదవికి పేటోంగ్‌టార్న్ మాత్రమే అభ్యర్థి. పార్లమెంటులో ఆమెకు అనుకూలంగా 310 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 145 మంది సభ్యులు ఓటు వేశారు. 27 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ప్రస్తుత నూతన ప్రధాని పేటోంగ్‌టార్న్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. థాయ్‌లాండ్‌లో నిలిచిపోయిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం. సైనిక తిరుగుబాట్లు, కోర్టు జోక్యాలను నివారించడం కీలకమని చెప్పవచ్చు. ఇటీవల నైతిక ఉల్లంఘన కేసులో కోర్టు నిర్ణయంతో మాజీ ప్రధాని శ్రేతా తవిసిన్‌ తొలగించబడ్డారు. దీంతో శుక్రవారం జరిగిన పార్లమెంటరీ ఓటింగ్‌లో ఎంపీలు షినవత్రాను దేశ ప్రధానిగా ఎన్నుకున్నారు.

Read Also: Malavika Mohan : ‘తంగలాన్’ సినిమా నుంచి అన్‌సీన్‌ ఫోటోను పంచుకున్న మాళవిక మోహన్‌