Site icon HashtagU Telugu

Peru : రన్ వేపై మరో వాహనాన్ని ఢీకొట్టిన విమానంలో మంటలు…తప్పిన పెనుప్రమాదం..!!

Plane Crash

Plane Crash

పెరూలోని లిమా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన LATAM ఎయిర్ లైన్స్ విమానం రన్ వే పై ఫైర్ ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే అద్రుష్టవశాత్తు విమానంలో ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ట్రక్కులో ఉన్న ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

దీంతో లిమా ఎయిర్ పోర్టును కార్యాకలాపాలను నిలిపివేసినట్లు ట్వీట్ చేసింది. ప్రమాదానికి గురైన విమానంలో Airbus A320neoలో 102 మంది ప్రయాణికులు మరియు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానంలోఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఘటనలో మరణించిన అగ్నిమాపక సిబ్బంది కుటుంబాలకు అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో తన సంతాపాన్ని ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 3.24గంటలకు జరిగింది. ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు చేపట్టారు.